Samantha ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం.. మరో ప్రాజెక్ట్ స్టార్ట్!
సమంత రూత్ ప్రభు నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా సమంత పూర్తి చేయడానికి సిద్ధమయింది. తన ఆరోగ్యం కాస్త బాగోలేకపోయినప్పటికీ కూడా ఆమె సినిమా విడుదల డేట్ ను దృష్టిలో ఉంచుకొని డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసింది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఆ విషయం గురించి చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక సమంత వీలైనంత త్వరగా కోలుకోవాలని ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. అయితే సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇక మరికొంత షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది.

అయితే హఠాత్తుగా సమంత అనారోగ్యం గురించి తెలియడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు ఆమెకు రెస్ట్ అవసరమని షూటింగ్ కు కొంత గ్యాప్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. సమంత పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతనే ఆమెకు సంబంధించిన షెడ్యూల్ ను మొదలుపెట్టాలి అని కూడా డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ మళ్ళీ ఖాళీగా ఉండకుండా మరొక ప్రాజెక్టును లైన్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించబోతున్న ఆ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో కూడా ఒక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు త్వరలోనే మరొక సినిమాను కూడా సెట్స్ పైకి తెచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











