Liger: కంచమేంటి ఇంతుంది.. వామ్మో విజయ్ ముందు బిగ్గెస్ట్ భోజనం!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం తెరకెక్కిన టైగర్ లైగర్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్ కొనసాగుతున్న విధానం చూస్తుంటే అప్పుడే సక్సెస్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ కు అలాగే పూరి జగన్నాథ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగులో కంటే హిందీలో కూడా ఏమాత్రం తక్కువ కాకుండా హైప్ క్రియేట్ అవుతూ ఉండడం విశేషం. విజయ్ దేవరకొండ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి అర్థమవుతోంది. ఇటీవల నార్త్ ఇండస్ట్రీలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ వీలైనంతవరకూ జనాల ముందుకు వెళ్లి ప్రమోషన్ చేయాలని అడుగులు వేస్తోంది. అయితే కొన్నిసార్లు ఈవెంట్స్ కు జనం భారీగా తరలి వస్తుండడంతో బందోబస్తు ఏర్పాటు చేయడం సాధ్యం కావడంలేదు.

ఈ క్రమంలో ఇప్పటికే ముంబైలో ఒక ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనాల నుంచి రెస్పాన్స్ చాలా ఎక్కువగా వస్తోంది అని చిత్ర యూనిట్ సెన్సిటివ్ ప్రదేశాల్లో పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. విజయ్ దేవరకొండ గుజరాత్ వెళ్లగా అక్కడ కాలేజీ యువత నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది. అయితే తరచుగా ప్రమోషన్స్ కు సంబంధించిన మూమెంట్స్ ను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు.
అంతేకాకుండా అక్కడే భోజనాలు కూడా చేస్తున్నాడు. ఇటీవల గుజరాత్ లో ఫేమస్ అయిన అతిపెద్ద తాలీ కూడా టెస్ట్ చేసినట్లు విజయ్ తెలిపాడు. అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ తేజ్ నాయక్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్ గుర్తొస్తుంది అంటూ కంచమేంటి ఇంతుంది.. అని మరికొంతమంది పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరి సినిమా ఆగస్టు 25 విడుదల తర్వాత ఇంకా ఏ స్థాయి లో సెన్సేషన్ క్రియేట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











