For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Boycott పై ఎవరు ఊహించని విధంగా స్పందించిన విక్రమ్.. పంచ్ వైరల్!

  |

  ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాయ్ కాట్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. కాస్త తేడా వచ్చినా కూడా సినిమాలను బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ ట్యాగ్స్ ను ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాయ్ కాట్ విషయంపై పలువురు సినీ తారలు కూడా చాలా సున్నితంగా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోబ్రా సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టాలెంటెడ్ హీరో విక్రమ్ మాత్రం చాలా సరదాగా ఆ విషయంపై స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ఇంతకు అతను ఏమన్నాడు అనే వివరాల్లోకి వెళితే...

  Recommended Video

  Rocking Star Yash , విక్రమ్ గురించి Srinidhi Shetty ఎలివేషన్ *Tollywood | Telugu FilmiBeat
   ప్రాణం పెట్టి నటించే వారిలో..

  ప్రాణం పెట్టి నటించే వారిలో..

  మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా అలాంటి నటుడు లేడు అనే చెప్పాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక పాత్ర కోసం ప్రాణం పెట్టి మరి నటించే వారిలో విక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు. అందుకు నిదర్శనంగా శంకర్ ఐ సినిమా నిలిచింది.

  అయినా ప్రయోగాలు తగ్గలేదు

  అయినా ప్రయోగాలు తగ్గలేదు

  విక్రమ్ తెలుగు వారికి అపరిచితుడు సినిమాతో చాలా దగ్గరయ్యాడు. ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో పర్వాలేదు అనిపించే విధంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం విక్రమ్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ కూడా అతని ప్రయోగాలు మాత్రం తగ్గడం లేదు.

  కోబ్రా సినిమాతో

  కోబ్రా సినిమాతో


  విక్రమ్ ఏదైనా సినిమా చేస్తే మాత్రం అందులో తప్పకుండా ఏదో ఒక సరికొత్త కంటెంట్ ఉంటుంది అని ముఖ్యంగా అతని నటన అందులో హైలెట్ గా అవుతుంది అని కూడా ప్రేక్షకులలో బలమైన నమ్మకం అయితే ఉంది. ఇక ఇప్పుడు అతను కోబ్రా సినిమా మరొక డిఫరెంట్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

  బాయ్ కాట్ ప్రశ్నపై..

  బాయ్ కాట్ ప్రశ్నపై..

  తెలుగులో ప్రమోషన్ చేసేందుకు హైదరాబాద్ వచ్చిన విక్రమ్ ఇక్కడ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం తెలియజేశారు. అయితే ఎంతో సెన్సిటివ్ గా మారిపోయిన బాయ్ కాట్ వివాదంపై కూడా ఆయన తనదైన శైలిలో చాలా హాస్యాస్పదంగా వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న బాయ్ కాట్ వివాదం గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు అనే ప్రశ్న విక్రమ్ కు ఎదురయింది.

  ఫన్నీ ఆన్సర్

  ఫన్నీ ఆన్సర్

  అయితే విక్రమ్ ఆ ప్రశ్నపై స్పందిస్తూ బాయ్ అంటే తెలుసు అలాగే కాట్ అంటే తెలుసు అలాగే గర్ల్ అంటే కూడా తెలుసు కానీ ఈ తరహా పదం నేనెప్పుడూ వినలేదు అంటూ.. అయినా ప్రస్తుతం తన మైండ్లో మొత్తం కోబ్రా అనే సినిమా కొనసాగుతోంది అని చాలా ఫన్నీ గానే వివరణ ఇవ్వడం విశేషం. ఒక విధంగా విక్రమ్ తన కెరీర్లో పెద్దగా వివాదాలు జోలికి వెళ్ళింది లేదు. కేవలం నటన ప్రపంచంలోనే చాలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాడు. ఇక బాయ్ కాట్ వివాదంపై కూడా ఆయన ఇలా సున్నితంగా ఫన్నీగా వివరణ ఇవ్వడం విశేషం.

  English summary
  actor vikram funny answered on boycott bollywood issue
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X