మళ్ళీ ప్రేమలో పడ్డ విశాల్.. వివాహానికి రంగం సిద్దం.. అలా ఓపెన్ అయ్యాడుగా!

సినీ పరిశ్రమలో ప్రేమలు ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి కొంతమంది సినీ పరిశ్రమలో ఉన్న వారినే ప్రేమించి వివాహం చేసుకుంటే మరి కొంతమంది మాత్రం సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సంబంధంలేని వారితో ప్రేమలో పడి వివాహాలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విశాల్ కృష్ణారెడ్డి మరోసారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడని ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని మీడియాలో ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో

వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో

తండ్రి వారసత్వం అందుకుని సినీ హీరోగా మారిన విశాల్ కృష్ణారెడ్డి తెలుగులో కంటే తమిళంలో బాగా పాపులర్ అయ్యాడు. తొలుత అక్కడే లాంచ్ అయిన ఈ హీరో తర్వాత కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు విశాల్ సినిమాలు వస్తున్నాయి అంటే అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఇక్కడ కూడా మినిమం మార్కెట్ ఏర్పరచుకున్న విశాల్ మొదట్లో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది.

ఎంగేజ్మెంట్ కూడా

ఎంగేజ్మెంట్ కూడా


శరత్ కుమార్ కు విశాల్ ఇష్టం లేదు కాబట్టి వారిద్దరి వివాహానికి ఆయన అడ్డుగా ఉన్నాడని లేకపోతే వారు పెళ్లి చేసుకునేవారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగేవి. అయితే 2019వ సంవత్సరంలో అది నిజం కాదని మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. విశాల్ అనిషా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ విశాల్ ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.

సోషల్ మీడియాలో ప్రచారం

సోషల్ మీడియాలో ప్రచారం


తర్వాత నడిగర్ సంఘం కోసం ఒక భవనం కట్టాలని అనుకుంటున్నానని ఆ భవనం కట్టడం పూర్తయిన తర్వాత అదే భవనంలో తన పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రతిజ్ఞ చేశాడు. ఏ సమయాన ఆయన అలా ప్రతిజ్ఞ చేశాడో గానీ ఆయన పెళ్లి కూడా దాదాపుగా ఆగిపోయింది.. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు విశాల్ తాను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈసారి తల్లిదండ్రులు చూసిన అమ్మాయి కాకుండా తాను స్వయంగా ఒక అమ్మాయిని చూసుకున్నానని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆమెనే వివాహం చేసుకుంటా

ఆమెనే వివాహం చేసుకుంటా


తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ పెళ్లి గురించి ఇంటర్వ్యూ చేసే యాంకర్ ప్రస్తావించగా త్వరలోనే పెళ్లి చేసుకుంటాను ఈసారి మా అమ్మానాన్న చూసిన అమ్మాయి కాదు నేను ప్రేమించిన అమ్మాయి ఉంది ఆమెనే వివాహం చేసుకుంటాను అంటూ విశాల్ చెప్పినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు


అయితే విశాల్ ఈ మధ్యనే లాఠీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ లాఠీ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు గాయాలు కావడంతో ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇక ఆయనని చంపేస్తానని రాజదురై అనే నటుడు వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరిస్తున్నట్లు నడిగర్ సంఘం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X