కుప్పంలో చంద్రబాబుపై పోటీపై హీరో విశాల్ క్లారిటీ
ఏపీ రాజకీయాల్లోకి తమిళ నటుడు విశాల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు మీడియాను కుదిపేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీకి రెడీ అవుతున్నారనే వార్తలు విస్తృతతంగా ప్రచారం అవుతున్నాయి. వైసీపీలోని బాడా నాయకులు ఈ వార్తను మీడియాలో వైరల్‌గా మారడంలో సఫలీకృతమయ్యారు. దాంతో ఏపీలో విశాల్ రాజకీయ ప్రవేశంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. అయితే తన రాజకీయ ప్రవేశంపై మీడియాలో వస్తున్న కథనాలపై హీరో విశాల్ స్పందించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే?
నా రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలోను, అలాగే వెబ్ మీడియాలోను వచ్చిన వార్తలు నా దృష్టికి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి రూమర్లను నమ్మకండి అని విశాల్ తెలిపారు.

ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ముఖ్యంగా చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.అయితే ఈ వదంతులను నమ్మకూడదు. ఈ వార్తలను నేను ఖండిస్తున్నాను. ఏపీలో పొలిటికల్ ఎంట్రీ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ప్రస్తుతం చంద్రబాబుపై పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు అని విశాల్ తెలిపారు.
ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదు. నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. సినిమాలతో బిజీగా ఉన్నాను. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు అని విశాల్ తెలిపారు. దాంతో అనేక రూమర్లకు విశాల్ తెరదించారు.


Click it and Unblock the Notifications











