ఘనంగా విశాల్ ఎంగేజ్‌మెంట్.. ఆ భవనంలోనే పెళ్లి.. తేదీ ఎప్పుడంటే!
సినీ హీరో విశాల్ పెళ్లి నిశ్చితార్థం నటి ఆళ్ల అనిశారెడ్డితో ఘనంగా జరిగింది. ప్రముఖ హోటల్‌లో శనివారం (మార్చి 16) అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి నిశ్చితార్తం కార్యక్రమానికి తమిళ, తెలుగు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వర్గాలు భారీగా హాజరయ్యారు. ఈ వేడుక విశేషాలు ఏమిటంటే..

గతకొద్దికాలంగా అఫైర్‌లో
విశాల్‌కు కాబోయే భార్య ఆళ్ల అనిశా ఓ పారిశ్రామిక వేత్త కూతురు. అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు చిత్రంలో చిన్న పాత్రల్లో నటించింది. గత కొద్దికాలంగా విశాల్, అనిశా ప్రేమించుకొంటున్నారు. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు వీరి పెళ్లి సాధ్యమైంది.

ఘనంగా ఎంగేజ్‌మెంట్
శనివారం ఐటీసీ కోహినూర్‌లో సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో విశాల్, అనిశా ఎంగేజ్‌మెంట్ జరిగింది. వారిద్దరూ ఉంగరాలు మార్చుకొన్న తర్వాత ప్రేమగా అనిశాను విశాల్ కౌగిలిలోకి తీసుకొన్నారు. సెప్టెంబర్‌లో వీరి వివాహం జరుగుతుంది. త్వరలో వివాహా తేదీని వెల్లడించే అవకాశం ఉంది.

తమిళ, తెలుగు నటులు హాజరు
విశాల్ నిశ్చితార్తం వేడుకలో తమిళ నటులు మనోబాల, కుట్టి పద్మిని, శ్రీమన్, సౌందర్ రాజా హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా కొందరు హాజరైనట్టు సమాచారం. ఇంకా ఎవరెవరూ హాజరయ్యారనే విషయంపై క్లారిటీలేదు.

నడిగర్ భవనం పూర్తయిన తర్వాతే
విశాల్ పెళ్లికి సంబంధించిన మరోవార్త తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో తమిళ నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకొంటానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ భవనం పూర్తి కానున్నది. ఆ కారణంగానే తన పెళ్లికి విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ భవనంలో విశాల్ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

టెంపర్ రీమేక్ చిత్రంలో విశాల్
తెలుగులో ఘన విజయం సాధించిన టెంపర్ రీమేక్ ఆయోగ్య చిత్రంలో ప్రస్తుతం విశాల్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో రాశీఖాన్నా హీరోయిన్‌గా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











