‘మేం అద్దాల మేడలో ఉంటాం.. ఏదైనా ఆచీతూచి మాట్లాడాలి ’: మంచు విష్ణు
Tirupati laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పలువురు తనని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ అండ్ హీరో మంచు విష్ణు మధ్య సోషల్ మీడియా వేదికన పెద్ద సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ హీరో వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
మా అధ్యక్షుడు మంచు విష్ణు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ .. ఆయన అలా పోస్ట్ పెట్టడం వ్యక్తిగత అభిప్రాయం అని అన్నాడు. అందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదని చెప్పుకొచ్చారు హీరో విష్ణు. ప్రకాష్ రాజ్ ఎలా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారో తను కూడా అలాగే తన అభిప్రాయాన్ని తెలిపానని పేర్కొన్నాడు మంచు విష్ణు. ఆ గొడవకు మతం రంగు లేదని తాను గర్వంగా చెప్పగలనని, తాను మాట్లాడిన కరెక్ట్ నని అన్నాడు.

నాన్న మోహన్ బాబు నటించిన ఎన్నో చిత్రాల్లో ప్రకాష్ నటించారు. నాకు చాలా ఏళ్లుగా ప్రకాశ్ రాజ్ తెలుసునని వెల్లడించారు. తాను ప్రకాష్ రాజ్ ను అంకుల్ అని పిలుస్తానని, ఆయన అంటే నాకు గౌరవ, మర్యాదలు ఉన్నాయని, తాను తప్పుగా ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంచు విష్ణు జనాలకు క్లారిటీ ఇచ్చాడు.
అలాగే ఈ చిన్న ఇష్యూపై బయట మాట్లాడడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో తెలియదు. నాకు ఆ భయం ఉందని అన్నాడు. మేం అద్దాల మేడల్లో ఉంటామని, నేను ఏదైనా మాట్లాడితే.. అందరికీ నచ్చాలనీ లేదు. కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. మేమంటే పడనివారు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి టార్గెట్ చేస్తారని వెల్లడించారు మంచు విష్ణు.
అందుకే ఈ వివాదంపై నటీనటులు స్పందించలేదని, నటీనటులు ఏ విషయంపై అయినా ఆచితూచి మాట్లాడతారని అన్నాడు. ఇక ప్రస్తుతం తిరుమల తిరుపతి లడ్డూ వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక రాజకీయ నాయకులు స్పందించి తీవ్రంగా మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూ అపవిత్రం కావడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ తప్పు జరిగినందుకు దీక్ష కూడా చేపట్టారు. మొన్న విజయవాడలో ఓ గుడి వల్ల దీక్ష ప్రారంభించి.. గుడి మెట్లు కూడా తుడిచారు.
ఇదెలా ఉంటే.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ.. మీరు డిప్యూటీ సీఎంగా ఏపీ రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇదని, విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని, మీరు ఎందుకు అనవసర భయాలు కల్పించి ఈ ఘటనను జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేస్తున్నారని అన్నారు.
అలాగే మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇక దీనిపై మంచు విష్ణు స్పందించడంలో నెట్టింట మరింత వివాదం చోటుచేసుకుంది.

ఇంతా జరుగుతున్న ప్రకాశ్ రాజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. జస్ట్ అస్కింగ్ అంటూ.. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కంటిన్యూగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పలువురు తన ప్రకాశ్ ను ఏకీపారేస్తున్నారు. ఇతర మతస్థుల మనోభావాలు తింటే.. నోరు పారేసుకుంటారు. కానీ, హిందూవుల మనోభావాలకు విఘాతం కలిగితే మాట్లాడారా? అని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











