For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాసే ఆ మాటనలేదు.. పేరు మారుస్తావా?,.. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? విశ్వక్ సేన్‌తో ఆటాడుకున్న నెటిజన్లు!

  |

  సింగిల్ హీరోగా చేసిన మొదటి సినిమాతోనే mass ka das అనిపించుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు పాగల్ అనే సినిమాతో ఈనెల 14వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో విశ్వక్సేన్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఆయన చేసిన కామెంట్స్ మీద ట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  Adah Sharma బికినీ అందాలన్నీ ఒక్క చోట.. చిన్నప్పటి నుంచీ ఇప్పటిదాకా!

  ప్రీ రిలీజ్ కాదు ఇది సక్సెస్ మీట్

  ప్రీ రిలీజ్ కాదు ఇది సక్సెస్ మీట్

  అయితే ముందుగా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన విశ్వక్సేన్ మైక్ అందుకోగానే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదని సక్సెస్ మీట్ అని అన్నాడు. ఇది ఏంది రా బాబు అనుకుంటూ ఉంటే నేను ఈ సినిమాని మధ్యాహ్నం చూసేశా అని అందుకే సినిమా హిట్ అని నాకు నమ్మకం వచ్చింది కాబట్టే సక్సెస్ మీట్ అంటున్నాను అని చెప్పుకొచ్చాడు..

  అంతే కాక ముందు ప్రేమ గురించి మాట్లాడతానని మొదలు పెట్టిన ఆయన చాలా మంది నేను లవ్ చేస్తున్నాను అని అంటారని కానీ దానికి ఉండే క్యాలిక్యులేషన్ ఏమిటి అంటే ముందు అందంగా ఉందో లేదో చూస్తారని ఆ తర్వాత డబ్బులు చూస్తారని మూడోది కూడా ఉంది అది ఏంటంటే మన కులమా కాదా అనేది కూడా చూస్తారు అని అన్నారు. ఈ క్యాలిక్యులేషన్ లు ఏమి లేకుండా అన్ కండిషనల్ గా ప్రేమించిన వాడే ఈ సినిమాలో ప్రేమ్ అని, వాడి ప్రేమకథ ఈ పాగల్ అని చెప్పుకొచ్చారు.

  Bigg Boss OTT భామ నేహా భాసిన్.. మత్తెక్కించే అందాలతో హంగామా!

  స్టోరీ లీక్

  స్టోరీ లీక్

  అంతేకాక ఈ సినిమా స్టోరీ కూడా ముందే చెప్తున్నా అని విశ్వక్సేన్ స్టోరీ కూడా చెప్పేశాడు.. ఈ సినిమాలో ప్రేమ్ అనే బాలుడికి తన తల్లి తప్ప వేరే వాళ్ళు ఎవరూ ఉండరని అమ్మే ప్రేమ్ కి అన్ని అని చెప్పుకొచ్చాడు. వాడు ఒకరోజు రాత్రంతా మెలకువగా ఉండి అమ్మ పెయింటింగ్ వేస్తాడని అమ్మ లేచి ఎందుకు నాన్న రాత్రి అంతా నా బొమ్మ చేస్తున్నావ్ అని అడిగితే నీ అంత బాగా నన్ను వేరెవరో చూసుకోరు కదా అమ్మా అని అంటాడు అని చెప్పుకొచ్చారు.

  అయితే అప్పుడు ఆ తల్లికి తాను రెండు నెలల్లో చనిపోతున్నట్లు తెలుసని అందుకే ఆమె ఆ కొడుకు తో మనం ఎవరిని ప్రేమించిన తిరిగి ప్రేమిస్తారు అని కాకపోతే అది కండిషనల్ కాకూడదు అని చెప్పుకొచ్చింది. నువ్వు అన్ కండిషనల్ గా ప్రేమిస్తే నిన్ను అందరూ ప్రేమిస్తారని చెబుతుందని అలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఆ తల్లి చనిపోతుంది అని చెప్పుకొచ్చాడు.

  మేము పాగల్ కాబట్టి శనివారం

  మేము పాగల్ కాబట్టి శనివారం

  ఇక తల్లి చనిపోవడంతో ప్రేమ్ ఒంటరివాడు అవుతాడని అప్పుడు ఎవరి సాంగత్యం లేక ఆలోచిస్తున్న క్రమంలో వాడికి తల్లి చెప్పిన ప్రేమించు అనే మాట గుర్తిస్తుందని నువ్వు అందరినీ ప్రేమించు ఎక్కడో ఒక దగ్గర నా ప్రేమ దొరికుద్ది అని చెప్పిన మాట అని గుర్తించుకొని తల్లి ప్రేమ ని వెతుక్కోవడం మొదలు పెట్టాడు అని చెప్పుకొచ్చాడు.

  అలా సుమారు 1600 మందితో ప్రేమలో పడినట్లు గా మనకు ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాని ఐదు రూపాయలలో తీద్దాం అనుకున్నాం కానీ దానికి ఐదు రెట్లు దిల్ రాజు గారు ఎక్కించారని చెప్పుకొచ్చాడు. అసలు ఈ సినిమా కథ విన్నప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్న విశ్వక్సేన్ మీకు ఎవరికీ తెలీదు ఈ సినిమాతో మేము పెద్ద హిట్ కొడుతున్నాము అని చెప్పుకొచ్చాడు. అలాగే సాధారణంగా అందరూ సినిమాలు శుక్రవారం నాడు విడుదల చేస్తారు కదా అయితే మేము పాగల్ కాబట్టి శనివారం రిలీజ్ చేస్తున్నామని. శనివారం రోజు పార్టీలు పబ్బులు మా థియేటర్ లోనే ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.

  పేరు మార్చుకుంటా

  పేరు మార్చుకుంటా

  అయితే అసలు ఇలాంటి సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్ట్ ఏనా అని అడుగుతున్నారని అలా అడుగుతున్న వాళ్ళందరికీ తాను చెప్పేది ఒక్కటే అని అన్నారు. సర్కస్ లో ఉన్న సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వెళ్లి ఆడుకుని వచ్చే టైపు నాపేరు విశ్వక్సేన్ ఈ సినిమా విషయంలో నా అంచనాలు తప్పయితే పేరు మార్చుకుంటా, అని చెప్పిన ఆయన థియేటర్లలో మాత్రం సీట్లు చింపవద్దు ప్లీజ్ మామూలుగా ఇండియా మొత్తానికి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 కానీ సినిమా థియేటర్స్ కి మాత్రం ఇండిపెండెన్స్ డే 14 ఆగస్టు అంటూ తన సినిమా మీద కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  ప్రభాసే అనలేదు

  ప్రభాసే అనలేదు

  అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా విశ్వక్సేన్ కాన్ఫిడెన్స్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా చేసినా ఆ సినిమా హీరోకి తమ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండడం సాధారణం. కానీ విశ్వక్సేన్ కామెంట్స్ చూస్తుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

  అంతే కాదు బాహుబలి లాంటి సినిమా తీసిన ప్రభాస్ కూడా ఇంతలా కామెంట్లు చేయలేదని, మరి ఏం చూసుకుని విశ్వక్సేమ్ ఇలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు.. పట్టుమని పది సినిమాలు కూడా చేయకుండా ఈ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తే భవిష్యత్తులో బాధపడక తప్పదు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే అసలు సినిమా కథ మొత్తం రివీల్ చేస్తే సినిమా మీద ఇంట్రెస్ట్ ఇంకెందుకు ఉంటుంది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.. మరి చూడాలి విశ్వక్సేన్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటుందా లేక నిజంగానే కాన్ఫిడెన్స్ గా నిలుస్తోంది అనేది.

  English summary
  Some of the comments made by Vishwaxen at the Paagal Pre Release event are now going viral on social media. Many are trolling his comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X