For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దారుణమైన పరిస్థితుల్లో రవితేజ.. రోజుకు పది రూపాయలతో అలా బతికారంటూ బయటపెట్టిన హీరోయిన్!

  |

  సినీ పరిశ్రమలో ఎక్కువగా సినిమా కష్టాలు అనే పదం వాడుతూ ఉంటారు. కొన్ని సినిమాల్లో ఎలా అయితే కష్టాలు చూపిస్తారో, నిజజీవితంలో కూడా సినిమా స్టార్లు ఆ కష్టాలు దాటుకుని ఆ స్థాయికి వచ్చారు అని కూడా అంటూ ఉంటారు. అందరి సంగతి పక్కన పెడితే రవితేజ మాత్రం చాలా చిన్న స్థాయి నుంచి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి ఈరోజు మాస్ మహారాజా అనిపించుకునే స్థాయికి వచ్చారు అని చెప్పక తప్పదు. అయితే ఆయన కెరీర్ స్ట్రగుల్స్ గురించి తాజాగా ఒక హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  గుర్తింపు లేని పాత్రలు

  గుర్తింపు లేని పాత్రలు

  సినిమా హీరో అవ్వాలని ఆశతో సినీ రంగ ప్రవేశం చేసిన రవితేజ అంత ఈజీగా అయితే అవకాశాలు దక్కించుకోలేదు. మొదట సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ చిన్న చిన్న ఊరు పేరు లేని పాత్రలు కూడా చేస్తూ వచ్చిన ఆయన మొట్టమొదటి సారిగా కర్తవ్యం అనే సినిమాలో చక్రవర్తి స్నేహితుడిగా కనిపించాడు. అలా మొదలు పెట్టి నిన్నే పెళ్ళాడుతా సినిమా వరకు అనేక సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వెళ్లాడు.

   నీకోసం అనే సినిమాతో

  నీకోసం అనే సినిమాతో


  పూర్తిస్థాయి నటుడిగా ఆయన నటించిన మొట్ట మొదటి సినిమా సింధూరం. ఆ సినిమాలో చంటి అనే పాత్రలో మెరిసిన రవితేజ ఒక్కసారిగా అందరి కళ్ళలో పడ్డాడు. అయినా సరే ఆయనకు వెంటనే అవకాశాలు వచ్చే లేదు, ఎంతో కష్ట పడితే ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమా అవకాశాలు లభించాయి. అలా చిన్నాచితక పాత్రలు చేస్తూ వెళ్లిన ఆయన నీకోసం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

  అమీర్పేట్ లో

  అమీర్పేట్ లో


  ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా నటించిన అన్నయ్య సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే చిన్నాచితక పాత్రలు చేస్తూ వెళ్ళిన రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇడియట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. అయితే ఆయన తన కెరీర్ మొదట్లో అనేకసార్లు ఇబ్బందులు పడ్డారని అమీర్పేట్ లో అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అశ్విని పేర్కొన్నారు.

   రాత్రికి భోజనం దొరకదని

  రాత్రికి భోజనం దొరకదని


  ఆమె రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమా లో ఒక సాంగ్ లో కనిపించారు. ఇక ఆ సినిమా షూటింగ్ విశేషాలు పంచుకుంటూ రవితేజ గారు పది రూపాయలతో రోజంతా ఎలా గడిపేవాడిని అనే విషయాన్ని నా దగ్గర ప్రస్తావించారని అన్నారు. ఆయన 10 రూపాయలతో మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రికి భోజనం దొరకదని భావించి రాత్రి కోసం ఆ పది రూపాయలు దాచుకునే వారట.

  ఎన్నో కష్టాలు పడితే

  ఎన్నో కష్టాలు పడితే


  మధ్యాహ్నం ఏదో పనిలో పడితే ఆకలి బాధ తెలియదు కానీ రాత్రి నిద్ర పట్టాలంటే కడుపునిండాల్సిందే అని అందుకే పది రూపాయలు దాచుకుని రాత్రికి తినేవాడిని అని తనకు చెప్పినట్టు ఆమె వెల్లడించారు. ఎవరూ అంత ఈజీగా స్టార్స్ అయిపోయారు అని పేర్కొన్న ఆమె ఇలాంటి ఎన్నో కష్టాలు పడితే కానీ ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళలేరు అని చెప్పుకొచ్చారు.

  English summary
  Actress Ashwini reveals the struggling days of Ravi Teja in the latest interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X