ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా... మా అమ్మ తర్వాత అంటూ స్టార్ హీరోయిన్ ఎమోషనల్
తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదరహితుడు, అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. స్నేహానికి ప్రాణమిస్తూ, మిత్రుల కోసం నిలబడుతూ ఆయన అందరి చేత డార్లింగ్ అనిపించుకున్నారు. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ కావడమే గాక.. దేశంలోనే నెంబర్ వన్ హీరోగా చెలామణి అవున్నారు. సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. తన సంపాదనను కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఖర్చు చేస్తుంటాడు. మూడో కంటికి తెలియనివ్వకుండా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశాడు.
మంచితనానికి పెట్టింది పేరైన ప్రభాస్.. తన ఇంటికి ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టుకుండా పంపరు. తన పెదనాన్న కృష్ణంరాజు పెదకర్మ రోజున తమ స్వగ్రామం మొగల్తూరుతో భారీగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సహా దాదాపు లక్ష మందికిపైగా హాజరైనట్లుగా అంచనా. లక్షమందికి భోజనాలంటే ఏదో ఒకటి రెండు వెరైటీలు కాదు.. దాదాపు 30 నుంచి 40 రకాల వంటకాలు.. అది కూడా నాన్ వెజ్ కావడం గమనార్హం. టన్నులకొద్దీ చికెన్, మటన్, చేపలు, రొయ్యలను ఈ భోజనాల కోసం వినియోగించారు.

తన మిత్రులు, సన్నిహితులకు బహుమతులు, స్వీట్లు పంపడం ప్రభాస్‌కు అలవాటు. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ యూనిట్ సభ్యులందరికీ తన ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్. అవి మామూలుగా ఉండదు.. రకరకాల వంటకాలతో అదిరిపోతాయి. ఆ వంటకాలు తిన్నవారు వహ్ వా అనాల్సిందిలే. ప్రభాస్ ఫుడ్‌తో చేసే మర్యాద గురించి తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ముఖ్యంగా హీరోయిన్లు చాలా గొప్పగా చెబుతారు. గతంలో సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్ ముంబై నుంచి హైదరాబాద్ రావడంతో ఆమెకు తెలుగింటి వంటకాలతో ప్రభాస్ స్వాగతం పలికారు.
తన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ఓ షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. సెట్స్‌లో అడుగుపెట్టిన దీపికకు ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా విందు భోజనం వచ్చింది. ఈ ఫోటోలను దీపిక స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్.

ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రాజా సాబ్ సినిమాలో మాళవిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమె తాజా చిత్రం తంగలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో విలేకరులు.. రాజాసాబ్ ముచ్చట్ల గురించి అడగ్గా ప్రభాస్ పంపిన ఫుడ్, అతని వ్యక్తిత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. హైదరాబాద్‌లోనే బెస్ట్ ఫుడ్ ప్రభాస్ పంపించారని.. మా అమ్మ చేతి వంట తర్వాత తాను ఇప్పటి వరకు తిన్న ఫుడ్‌లో బెస్ట్ ప్రభాస్ సార్ పంపించిందేనని చెప్పింది.
మా అమ్మ చేతి వంటకి ఈక్వల్‌గా టేస్ట్ ఉందని.. ప్రభాస్ సార్ సినిమాలో నటించడం తనకు గర్వంగా ఉందని మాళవిక పేర్కొంది. మీరంతా రాజా సాబ్ చూడాలని కోరుకుంటున్నానని.. తంగలాల్‌లోని రోల్‌తో పోలిస్తే రాజాసాబ్‌లోని పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం మాళవిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరో మంచితనం చూసి పొంగిపోతున్నారు.


Click it and Unblock the Notifications











