twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్ పవర్ 'ప్లే బాయ్'.. స్టెజ్ పైనే గ్లామరస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అందరూ షాక్

    |

    కెరీర్ మొదలైనప్పుడు ఒక బాక్సాఫీస్ హిట్ అందితే ఏ హీరో అయినా సరే వరుసగా ఆఫర్లు అందుకోవడం కామన్. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందితే ఇండస్ట్రీలో ఒక మార్కెట్ సెట్టయినట్లే అని చెప్పవచ్చు. అయితే ఎంతో కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ నుంచి బిగ్ స్క్రీన్ వరకు వచ్చిన రాజ్ తరుణ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఈ మధ్య వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్నాడు. ఇక ఇటీవల ఒక సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ లో సీనియర్ హీరోయిన్ అతనిపై ఎవరు ఊహించని విదంగా కామెంట్ చేసింది.

    మళ్ళీ ఆ దర్శకిడితోనే..

    మళ్ళీ ఆ దర్శకిడితోనే..

    లాక్ డౌన్ కారణంగా రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగా సినిమా వాయిదా పడుతూ చివరికి ఓటీటీలోనే విడుదలైంది. ఇక ఆ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలోనే 'పవర్ ప్లే' అనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. రొటీన్ సినిమాలను పక్కనపెట్టి అల్లరి నరేష్ తరహాలో డిఫరెంట్ గా ట్రై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది.

    సినిమా ట్రైలర్ లాంచ్..

    సినిమా ట్రైలర్ లాంచ్..

    మొదటిసారి ఈ లవర్ బాయ్ త్రిల్లర్ కథను టచ్ చేస్తున్నాడు.థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక ఫైనల్ గా సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. ట్రైలర్ లాంచ్ వేడుకలో సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక అందులో ఒక కీలక పాత్రలో నటించిన నటి పూర్ణ రాజ్ తరుణ్ పై కాస్త సరదాగా కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

    షూటింగ్స్ లో నా ముందే..

    షూటింగ్స్ లో నా ముందే..

    ముందుగా సినిమా యూనిట్ సబ్యుల పని తనం గురించి చెబుతూ వచ్చిన నటి పూర్ణ రాజ్ తరుణ్ విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ గా కామెంట్ చేసింది. మొదట సినిమా సెట్స్ లోకి వచ్చినప్పుడు హీరో ఎక్కడ ఉన్నాడా అని వెతికాను. కానీ రాజ్ తరుణ్ మాత్రం అటు ఇటు నా ముందే తిరగడం గమనించలేదు. అతను చాలా సింపుల్ గా లిటిల్ బాయ్ లా ఉంటాడు.

    పవర్ 'ప్లే బాయ్' అంటూ..

    పవర్ 'ప్లే బాయ్' అంటూ..

    ఇక రాజ్ తరుణ్ పవర్ 'ప్లే బాయ్' అంటూ నవ్వుతూ అనేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. సినిమా టైటిల్ పవర్ ప్లే.. ఆ ప్లే బాయ్ అన్నట్లుగా మళ్ళీ కవర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా బావుంటుందని రాజ్ తరుణ్ కూడా ప్రతి సీన్ లో అద్భుతంగా నటించినట్లు పూర్ణ వివరణ ఇచ్చారు.

    English summary
    If a film succeeds early in life, it is natural that the heroes have huge offers. If they hit three or four hits in a row, they would be a market place in the industry. But the misfortunes of Raj Tarun are constantly falling apart. Even the movies that do that are having a lot of trouble getting up to the theaters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X