హీరో నాని కంటే విలన్ కు ఎక్కువ మార్కులేసిన హాట్ బ్యూటీ
Bigg Boss Telugu 8: బిగ్ బాస్.. బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులు ఎంతోగానే అట్రాక్ట్ చేసిన రియాల్టీ షో.. కోటాది మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో తెలుగులో సక్సెస్ పుల్ గా 7 సీజన్లను కంపింట్ చేసుకుంది. మరోసారి బీబీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి 8 వ సీజన్ తో ముందుకు వస్తుంది. ఈ సారి తగ్గేదేలే అనేలా.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అందించడానికి సిద్దమైంది. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన పలు అప్టేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ షోపై హై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నా షో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో స్టార్ మా బీబీ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసింది.
మోస్ట్ పాపులర్ షో బీబీ సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా బీబీ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో మాత్రం దుమ్మురేపుతుంది. ఇదేం ట్వీస్టుల్లారా బాబు అంటూ.. షాక్ అవుతున్నారు. నిజంగా ముందు చెప్పినట్టు ఏ మాత్రం తగ్గకుండా.. అన్ లిమిటెడ్ ఫన్ అందించాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బీబీ మెనేజ్ మెంట్ టీమ్. అందుకు తగ్గట్టుగానే దుమ్మురేపే కంటెస్టెంట్స్ లను పర్పెక్ట్ గా సెలెక్ట్ చేసి.. హౌస్ లోకి పంపినట్టు తెలుస్తుంది. కంటెస్టెంట్లను చూపించలేదు గానీ భయ్యా... వాళ్ల వాయిస్ వింటుంటే మాత్రం రచ్చ లేపడం ఖాయం..

ఈ ప్రోమో ప్రకారం.. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఏడు గంటలకు బీబీ హౌస్లోకి కంటెస్టెంట్స్ గృహప్రవేశం చేయబోతున్నారు. అలాగే ఈ సారి లాంచింగ్ ఈవింగ్ లో స్పెషల్ గెస్టుల లిస్టు కూడా చాలానే పెద్దగానే ఉంది. అందులోనూ స్టార్ సింగల్ గా కాకుండా జంటగా ఎంట్రీ ఇచ్చారు భయ్యా.. ఇది ఇంకో ట్వీస్ట్.. ఈ లాంచ్ ఈవింగ్ లో 'సరిపోదా శనివారం' హీరో హీరోయిన్లు నాని, ప్రియాంక మోహన్ సందడి చేశారు. వీళ్ల రచ్చ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఎక్కడ కూడా తగ్గేదే అంటున్న ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ ప్రియాంక ను బీబీ హోస్ట్ కింగ్ నాగ్ ఇరకడంలో పడేశాడు. ఓ క్లిష్టమైన ప్రశ్న వేసి.. ఆ బ్యూటీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ ప్రశ్ననేంటీ అనుకుంటున్నారా?
'సరిపోదా శనివారం' సూపర్ హిట్ అయిందిగా.. మరీ హీరో నాని పర్మామెన్స్ కి ఎన్ని మార్కులు ఇస్తావని కింగ్ నాగ్ అడగ్గా.. వందకు వంద మార్కులిస్తా అని చెప్పింది హీరోయిన్ ప్రియాంక మోహన్. మరి, విలన్ గా నటించిన ఎస్.జె. సూర్య గారికి సంగతి ఏంటి? ఆయనకు ఎన్ని మార్కులిస్తావ్ అని నాగార్జున అడిగారు. దీంతో ఈ అమ్మడు కాస్త ఇరకాటంలో పడింది. అప్పుడు ఈ క్యూట్ బ్యూటీ చాలా తెలివిగా ఆలోచించి.. నానికి వందకు వంద.. సూర్య గారికి వందకు '101' మార్కలేస్తానంటూ సమాధానం ఇచ్చింది. హీరో నాని కంటే ఎస్ జే సూర్యకు ఒక్క మార్క్ ఎక్కువ వేసింది హీరోయిన్ ప్రియాంక మోహన్.
బీబీ లాంచ్ ఈవెంట్ లో '35 ఇది చిన్న కథ కాదు' హీరోయిన్ నివేదా థామస్, రానా దగ్గుబాటి కూడా 'బిగ్ బాస్ 8' స్టేజి దర్శనమిచ్చారు. ఈ తరుణంలో హీరోయిన్ నివేదా థామస్ సందడి మాములుగా లేదు భయ్యా.. బిగ్ బాస్ లో ఉండాలని వాళ్లిద్దరినీ నాగార్జున ఆర్డర్ వేయగా.. రానాను ఐదు రోజులు.. తనని మాత్రం మూడు రోజుల్లో ఎలిమినేట్ చేయండంటూ రిక్వెట్ చేసుకుంది.
అలాగే.. దర్శకుడు అనిల్ రావిపూడి 'బిగ్ బాస్' హౌస్ లో కనిపించారు. అక్కడ నుంచి తాను ఓ జంటను బయటకు తీసుకు వెళ్లాలని, ఆ కంటెస్టెంట్ బదులు లక్కీ డ్రాలో మరొకరు లోపలికి వస్తారని అనిల్ రావిపూడి ఓ పంచ్ డైలాగ్ వేశారు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తూ.. ఈ సారి .. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పక్కా.. అంటున్నారు బీబీ లవర్స్.


Click it and Unblock the Notifications











