సెట్లో మేమంతా ఆకలితో.. బాలయ్యకు మాత్రమే భోజనం.. ఆ విషయాన్ని సీనియర్ నటి
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రవర్తన గురించి రకరకాల విషయాలు బయటకు వస్తూ ఉంటాయి కానీ సినీ పరిశ్రమలో ఆయనతో కలిసి పనిచేసే వారందరూ కూడా ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడుతూ ఉంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ గురించి నటి శివపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అనూహ్య పరిస్థితుల్లో
ప్రముఖ నటి శివ పార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అనేక సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించింది. సీరియల్స్ లో కూడా నటించిన ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకుంది. గతంలో వదినమ్మ సీరియల్ చేస్తున్న సమయంలో కరోనా బారిన పడడంతో ఆమె అనూహ్య పరిస్థితుల్లో వార్తల్లోలో కూడా ఎక్కారు.

చుట్టుపక్కల ఊర్ల నుంచి
తాజాగా ఆమె బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు సినిమా సంగతి బయట పెట్టారు. తాము ఒక్క మగాడు సినిమా షూటింగ్ కోసం ఒక ఊరిలో గుడికి వెళ్ళామని ఆమె చెప్పుకొచ్చారు అయితే బాలకృష్ణకు అప్పట్లో బీభత్సమైన క్రేజ్ ఉండడంతో ఆయనను చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి పెద్ద ఎత్తున జనం రావడంతో ఆ గుడి దగ్గరలో నిలబడటం కూడా కష్టం గా మారిపోయింది అని చెప్పుకొచ్చారు.

భోజనం కూడా తెచ్చి పెట్టలేక
కేవలం సినిమా వాళ్లను మాత్రమే గుడి లోపల ఉంచి మిగతా వాళ్లందరినీ బయటకు పంపించి వేసి తలుపులు వేశారని అయితే జనాలు అక్కడి నుంచి కదలకుండా బయట ఉండిపోయారు అని చెప్పింది. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం కూడా తినలేదని రెండు గంటలు దాటి మూడో గంట అవుతున్న సమయంలో అందరికీ ఆకలి వేస్తున్నా భోజనం కూడా తెచ్చి పెట్టలేని పరిస్థితి నెలకొందని ఆమె చెప్పుకొచ్చారు.

అందరికీ సరిపోయే విధంగా
అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా బాలకృష్ణకు మాత్రం భోజనం పెట్టాలని ఉద్దేశంతో ఒక పెద్ద క్యారేజీ తీసుకుని నిచ్చెన వేసుకుని గుడి లోపలికి తీసుకు వచ్చారని ఆ సమయంలో ఆయన తలుచుకుంటే ఎవరిని పిలవకుండా తను ఒక్కడే కూర్చుని తినగలరు కానీ ఆ క్యారేజి ని గుడి లోపల ఉన్న సినిమా యూనిట్ అందరికీ సరిపోయే విధంగా పంచి పెట్టాలని బాలకృష్ణ ఆదేశించారట.

అంత గొప్ప వారని
అక్కడ ఉన్న ఆడవాళ్ళలో తానే పెద్దదాన్ని కాబట్టి బాలకృష్ణ కు వచ్చిన ఆ క్యారేజీ లోని అన్నం కూరలు కలిపి చిన్న చిన్న బాక్స్లో అందరికీ ఇచ్చానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన తినాలి అనుకుంటే ఎవరు అడగలేని పరిస్థితి అయినా సరే ఆయన తానొక్కడే తినకుండా అందరికీ అన్నం పెట్టి కడుపులు నింపాడని ఆయన అంత గొప్ప వారని శివ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి శివ పార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











