Prabhas: పరాయి దేశంలో ప్రభాస్ సంచలనం.. ఏకైక హీరోగా రికార్డు.. ఎవరికీ అందనంత ఎత్తులో!

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీనికితోడు 'బాహుబలి'తో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్న అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోన్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ పాన్ ఇండియా హీరో 'ఆదిపురుష్' అనే మూవీతో వచ్చాడు. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ వివరాలు మీకోసమే!

Adipurush Crosses 3 Million Mark in Overseas.. Prabhas Stands On Top

రాముడిగా ప్రభాస్ వచ్చేశాడు: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు.

Adipurush Crosses 3 Million Mark in Overseas.. Prabhas Stands On Top

అలాంటి టాక్.. కలెక్షన్లు డల్: ఎంతో హైప్ క్రియేట్ చేసుకుని విడుదలైన 'ఆదిపురుష్' మూవీకి ఓవర్సీస్‌లోని ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ మొత్తం రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో మాత్రం ఇది ఆశించిన రీతిలో రాణించలేదు. ఫలితంగా తక్కువ వసూళ్లనే రాబడుతోంది.

Adipurush Crosses 3 Million Mark in Overseas.. Prabhas Stands On Top

ఓవర్సీస్‌లో భారీగా రెస్పాన్స్: రామాయణం నేపథ్యంతో ఓం రౌంత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ముందుగానే స్టార్ట్ అయ్యాయి. అక్కడ హాలీవుడ్ చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ప్రభాస్ చిత్రానికి మంచి స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే దీనికి ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా వసూలు అయ్యాయి.

Adipurush Crosses 3 Million Mark in Overseas.. Prabhas Stands On Top

3 మిలియన్ మార్కు చేరింది: 'ఆదిపురుష్' మూవీకి అమెరికాలో ప్రీమియర్స్ ద్వారానే 825K డాలర్స్ గ్రాస్ వసూలు అయింది. అలాగే, మొదటి రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా 680K డాలర్లను వసూలు చేసింది. ఇలా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే యూఎస్‌లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఇక, తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్ల మార్క్ చేరింది.

Adipurush Crosses 3 Million Mark in Overseas.. Prabhas Stands On Top

ప్రభాస్ ఖాతాలో గొప్ప రికార్డు: తాజాగా 'ఆదిపురుష్' మూవీ ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా ఈ మార్కును నాలుగు చిత్రాల ద్వారా చేరిన ఏకైక టాలీవుడ్ హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో అతడు నటించిన 'బాహుబలి', 'బాహుబలి 2', 'సాహో' చిత్రాలకు మూడు మిలియన్ డాలర్లు వచ్చాయి. దీంతో ఇప్పుడిది నాలుగోది అయింది.

Adipurush Crosses 3 Million Mark in Overseas.. Prabhas Stands On Top

తర్వాత స్థానాల్లో ఎవరంటే?: ఓవర్సీస్‌లో ఏకంగా నాలుగు సార్లు 3 మిలియన్ క్లబ్‌లో చేరిన ప్రభాస్ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక, అతడి తర్వాతి స్థానంలో రెండు చిత్రాలతో రామ్ చరణ్ ఉన్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లు ఒక్కోసారి మూడు మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నారు. ఇక, తాజా రికార్డుతో ప్రభాస్ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X