ప్రభాస్ బాడీ చూస్తే దిమ్మతిరగాల్సిందే... రూమర్లకు తెర దించిన ఆదిపురుష్ డైరెక్టర్!
బాలీవుడ్‌లో తానాజీ లాంటి చిత్రంతో మంచి పేరు తెచ్చుకొన్న దర్శకుడు ఓ రావత్ ప్రస్తుతం తన సినిమా ఆదిపురుష్ కోసం రామాయణ కథను ఎంచుకొన్నారు. రాముడి పాత్ర కోసం ప్రభాస్, రావణాసురుడు పాత్ర కోసం సైఫ్ ఆలీ ఖాన్‌ను ఎంపిక చేసుకొన్నారు. అలాగే కృతిసనన్‌ను కీలక పాత్రలో చూపించబోతున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను, సినిమా గురించిన పలు విషయాలను వెల్లడిస్తూ..
Recommended Video

నా కోరిక తగినట్టుగానే
గతంలో తాను తీసిన తానాజీ గానీ, ఆదిపురుష్ చిత్రం విషయంలో నాకు ఫలానా నటులు ఉండాలనే కోరిక ఉండేది. నా కోరిక తగినట్టుగానే అదృష్టం కొద్ది నేను అనుకొన్న నటీనటులు నా సినిమాలో నటించారు. ఆదిపురుష్ విషయంలో కూడా అలానే జరిగింది. నేను పనిచేయాలని డ్రీమ్ ఉన్న యాక్టర్లందరూ ఆదిపురుష్‌లో పనిచేస్తున్నారు అని దర్శకుడు ఓం రావత్ పేర్కొన్నారు.

ఆదిపురుష్ కోసం ప్రభాస్
ఆది పురుష్ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ ఆలీ ఖాన్ చాలా కష్టపడుతున్నారు. ఎవరూ ఊహించిన విధంగా తన దేహాధారుడ్యాన్ని పెంచుకొన్నారు. శారీరక సౌష్టవం తెర మీద చూస్తే థ్రిల్ అవ్వడం గ్యారెంటీ.. షూట్ జరుగుతున్న సమయంలో కూడా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం కష్టపడుతున్నారు అని ఓం రావత్ తెలిపారు.

ఆదిపురుష్ సెట్లో అత్యంత జాగ్రత్తలు
కరోనావైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తలు, ప్రమాణాలను పాటిస్తూ ఆదిపురుష్ సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఇప్పటికే 30 శాతం షూటింగును పూర్తి చేశాం. ముంబై అధికారులు, ప్రభుత్వ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం. షూటింగుకు ముందు కరోనా టెస్టులు చేయించుకొన్నాం. అలాగే సెట్స్‌లో ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాం అని ఓం రావత్ పేర్కొన్నారు.

30 రోజులపాటు షూటింగ్ పూర్తి
ఆదిపురుష్ కోసం నిర్విరామంగా 30 రోజులు షూటింగు చేశాం. ప్రతీ ఒక్కరు మాస్క్ పెట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. నిరంతరం సెట్లో పర్యవేక్షణ ఉంటుంది. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. తక్కువ మందితో షూటింగ్ చేస్తున్నాం అని దర్శకుడు ఓం రావత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











