ఆదిపురుష్ పై కూడా క్లారిటీ వచ్చేసింది.. ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న డార్లింగ్!
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల లిస్టు రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ప్రభాస్ అయితే ఏకంగా నాలుగు పెద్ద సినిమాలని లైన్ లో పెట్టడం పెద్ద సాహసమనే చెప్పాలి. మొత్తానికి రాధేశ్యామ్ షూటింగ్ అయిపోయింది. ఇక సలార్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డార్లింగ్ బాగానే కష్టపడుతున్నాడు. ఇక ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ Kను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. వైజయంతి బ్యానర్ లో రానున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ప్రభాస్ సెలెక్ట్ చేసుకుంటున్న కథలు కూడా చాలా విబిన్నంగా ఉంటున్నాయి. ఒకదానికొకటి సంబందం లేకుండా ఉన్నాయి. ఇక ఓ వర్గం వారి చూపు ఎక్కువగా ఆదిపురుష్ సినిమాపైనే ఉంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రామాయణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతొంది. ఇక సినిమాలో కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయ్యింది.

ఎలాగైనా ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయిన ప్రభాస్ ఒకవైపు సలార్, ప్రాజెక్ట్ K లను కూడా గ్యాప్ లేకుండా ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆదిపురుష్ సినిమాను 400కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలోని మెహబూబా స్టూడియోలో వేసిన ఒక భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.
కృతి సనోన్, సైఫ్ అలీ ఖాన్ మధ్య కొన్ని VFX సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఇక వచ్చే నెల ప్రభాస్ కూడా ఆ టీమ్ తో కలవబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ను ఇదే ఎడాది ఫినిష్ చేసి 2022 సమ్మర్ అనంతరం మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే ఆగస్ట్ 9 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











