Prabhas ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. ఎవరికైనా డౌట్ ఉందా? బాలీవుడ్ డైరెక్టర్ హాట్ కామెంట్
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. సాహో, రాధే శ్యామ్ చిత్రాలు అంతగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయినా తన మాస్ ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. ఆయన ముందు భారీ బడ్జెట్ చిత్రాలు, ప్రాజెక్టులు క్యూ కట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి ఇటీవల జాతీయ మీడియాతో ఓం రావత్ మాట్లాడుతూ..

ప్రభాస్ కెరీర్ ఇలా..
ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ K అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ తదితరులు భాగస్వామ్యమయ్యారు. ఇక ప్రశాంత్ నీల్‌తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రంలో నటించిందుకు అంగీకరించాడు. అయితే ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్‌పై బాలీవుడ్ నుంచి పొగడ్తల వర్షం కురుస్తున్నది.

ప్రతీ దర్శకుడు ప్రభాస్‌తో..
ఆదిపురుష్ దర్శకుడు ఓం రావత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ... దేశ సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్క దర్శకుడు ప్రభాస్ లాంటి హీరోతో కలిసి పనిచేయాలని అనుకొంటాడు. సినిమా కోసం, తన పాత్ర కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రాణాలను కూడా లెక్క చేయడు. అతడిలోని టాలెంట్‌లోని ప్రతీ కోణాన్ని దర్శకుడు రాబట్టి వెండితెర మీద మ్యాజిక్ చేయాలని అనుకొంటాడు అని ఓం రావత్ అన్నారు.

ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్
దేశంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో ప్రభాస్ నటన, ఆయన ప్రవర్తన విభిన్నమైనది. దేశంలోనే ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్ అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. దర్శకుడంటే ప్రభాస్‌కు అత్యంత గౌరవం. ఇతరుల పట్ల ఆయన వ్యక్తిగత ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది. ఆయన హృదయంలో ఉండే భావాలు కళ్లలో వ్యక్తమవుతాయి అని ఓం రావత్ పేర్కొన్నారు.

ఆయన కళ్లలో ఎక్స్‌ప్రెషన్స్
ప్రభాస్ కళ్లలో ఒకరకమైన పవర్ ఉంటుంది. అందుకే ఆయన కళ్ల ద్వారా అతడి టాలెంట్‌ను రాబట్టుకొన్నాను. ఆయన కళ్లలో ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆదిపురుష్‌లో సరికొత్త ప్రభాస్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు అని ఓం రావత్ అన్నారు.

ఆదిపురుష్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: ప్రభాస్, కీర్తి సనన్, సైఫ్ ఆలీ ఖాన్, సన్నీ సింగ్, సొనాల్ చౌహన్ తదితరులు
దర్శకత్వం: ఓం రావత్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రావత్
సినిమాటోగ్రఫి: కార్తీక్ పలని
ఎడిటింగ్: అపూర్వ మోతివాలే, ఆశీష్ మాత్రే
బ్యానర్స్: టీ సీరిస్ ఫిల్మ్స్, రెట్రోఫైలెస్
రిలీజ్ డేట్: 2023-01-12


Click it and Unblock the Notifications











