Adipurush నుంచి షాకింగ్ న్యూస్: ప్రభాస్ లేని పార్టే అంతా.. అభిమానుల్లో కలవరం
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరూ తమదైన శైలి టాలెంట్లతో సత్తా చాటుతున్నారు. ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. హీరోగా పరిచయం అయిన చాలా కాలం పాటు తెలుగు సినిమాలకే పరిమితం అయిన అతడు.. 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ప్రభాస్.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ దూసుకెళ్తున్నాడు. తద్వారా తన హవాను నేషనల్ లెవెల్‌లో చూపిస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటించాడు. ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. దీనితో పాటే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్', చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న 'ఆదిపురుష్'లో నటిస్తున్నాడు. వీటిలో మొదటిది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా.. రెండోది స్టయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రం రామాయణం నాటి కథతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ప్రత్యేకమైనది. దీనికి కారనం ఇది వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతుండడమే. రామాయణం నాటి కథతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ న్యూస్ లీకైంది.
'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 65 రోజుల షూటింగ్ జరిగిందట. అంటే ఇది సినిమాలో సుమారు సగం పార్ట్ అని తెలుస్తోంది. ఇందులో మాత్రం ప్రభాస్ పాల్గొన్న రోజులు చాలా అంటే చాలా తక్కువే. దీంతో ఇప్పుడు రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కలవరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అతడు లేకుండానే ఇన్ని రోజుల షూట్ చేస్తే.. సినిమాలో ఎంత సేపు కనిపిస్తాడని అభిమానులంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఈ న్యూస్ అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ రాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో పాగా వేయాలని యంగ్ రెబెల్ స్టార్ ఆశిస్తున్నాడు. దీన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











