twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adire Abhi:హీరోగా రెండో సినిమాకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‏లో కి .. సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుక

    |

    టెలివిజన్ స్క్రీన్ మీద సంచనాలు నమోదు చేసిన కామెడీ షో జబర్దస్త్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారో అంతే మంది ఈ షోను వ్యతిరేకించే వారూ ఉన్నారు. అయితే ఎవరేం అన్నా ఈ షో ఇప్పటికీ మంచి టీఆర్పీతో దూసుకుపోతూ వస్తుంది. అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో అదిరే అభి ఒకరు. ఆయన ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఒక సినిమా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయింది. ఆ వివరాల్లోకి వెళితే

    జబర్దస్త్ టీం లీడర్లలో అదిరే అభికి మంచి పేరు ఉంది. హైపర్ ఆది లాంటి ఎంతో మంది మంచి టాలెంట్ ఉన్న కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన సీనియర్ టీం లీడర్ అభి కేవలం జబర్దస్త్ షో ద్వారా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఇటీవల పాయింట్ బ్లాంక్ సినిమాతో హీరోగా మారిన ఆయన ఇప్పుడు ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు. నిజానికి ప్రభాస్ హీరోగా పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే అభి కూడా నటుడిగా పరిచయం అయ్యాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లెవెల్ కి వెళ్ళగా అభి మాత్రం ఉద్యోగం చేసుకుంటూ నటన మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేక ఇప్పుడు జబర్దస్త్ స్థాయిలో ఉండిపోయారు. అన్నట్టు అభి హూ వాంట్స్ టు బిఎ మిల్లియనీర్ అదేనండీ అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాక బాహుబలి 2 సినిమా కొరకు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌలి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.

    adire abhi movie white paper selected for indian book of records

    ఇక తాజాగా అభి మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు 'వైట్ పేపర్'. కాగా ఈ సినిమాని జీఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గ్రంధే శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేశారట. దీంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ సినిమాను అరుదైన సినిమాగా గుర్తించి రికార్డులకు ఎక్కించారు. అదిరే అభి పుట్టిన రోజున రోజున ఈ 'వైట్ పేపర్' సినిమా టైటిల్ ను మనో, ఇంద్రజ, అనసూయ కలిసి లాంచ్ చేశారు. ఇక దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయాలనే ఆసక్తి కలిగిందన్న అభి 9 గంటల 51 నిమిషాల్లోనే షూటింగ్ పూర్తి చేయాలన్న ఆయన డెడికేషన్ నచ్చిందని, ఆయన అనుకున్నట్లుగానే నిర్ణీత సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసామని అలా విడుదలకి ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సినిమా చోటు దక్కించుకుందని అన్నారు. సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి నవనీత్ చారి సంగీతం అందించారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

    English summary
    adire abhi movie white paper selected for indian book of records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X