twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంజా సినిమా వద్దనుకున్నా.. అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావు: అడివి శేష్

    |

    ఒక స్టార్ హీరోకన్నా కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటేనే ఎక్కువగా ఆనందంగా ఉంటుందట. అలా ఆనందపడే వారిలో అడవి శేష్ ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన డ్రీమ్ కోసం ఒంటరిగా పోరాడిన అసలైన వారియర్ అనే చెప్పాలి. అడివి శేష్ తన కల కోసం విదేశాల్లో ఎంతో కష్టపడి సంపాదించిన మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ఇక జాబ్ లో సంపాదించిన డబ్బును ఒక్కసారిగా పోగొట్టుకోవాల్సి వచ్చిందట. నేడు ఈ టాలెంటెడ్ యాక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతను కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నాడు.

     చిన్న వయసులోనే ప్రయత్నాలు

    చిన్న వయసులోనే ప్రయత్నాలు

    అడివి శేష్ అసలు లేరు సన్నీ చంద్ర. తండ్రి అడివి చంద్ర ఒక మంచి వైద్యుడు. చిన్నప్పుడే తండ్రి సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నాడట. కానీ యాక్సిడెంట్ కారణంగా అది కుదరలేదట. ఇక ఆ తరువాత తండ్రి ఇష్ట ప్రకారమే సినిమాల్లోకి వెళ్ళాడు అడివి శేష్. యుక్త వయసులో నుంచే అతను ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

    జాబ్ తరువాత ఆ సినిమాతో దర్శకుడిగా..

    జాబ్ తరువాత ఆ సినిమాతో దర్శకుడిగా..

    15 ఏళ్ళ వయసులోనే డైరెక్టర్ కృష్ణవంశీ ఒక సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించగా అందులోకి కూడా వెళ్లాడట. కానీ అప్పుడు వయసు చిన్నది కావడంతో రిజెక్ట్ కావాల్సి వచ్చిందట. ఇక ఫైనల్ గా విదేశాల్లో వెబ్ డిజైనర్ గా వర్క్ చేసి వచ్చిన డబ్బుతో సినిమాను నిర్మించాడు. అదే కర్మ సినిమా.

    పంజా సినిమాక్ వద్దనుకున్నాడట

    పంజా సినిమాక్ వద్దనుకున్నాడట

    అయితే ఆ సినిమా తరువాత పంజా సినిమాలో విలన్ కొడుకుగా నటించే అవకాశం వచ్చింది. అసలైతే ఆ సినిమా చేయవద్దని అనుకున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత హైప్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తే తప్పకుండా క్లిక్కవుతావాని తన ఫ్రెండ్ చెప్పడంతో నటించినట్లు అడివి మహేష్ వివరణ ఇచ్చాడు.

     రూమ్ రెంట్ కు కూడా డబ్బులు ఉండేవి కావు

    రూమ్ రెంట్ కు కూడా డబ్బులు ఉండేవి కావు

    అయితే ఆ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా కూడా అడివి శేష్ చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ఇక వెంటనే చాలా ఆఫర్స్ వచ్చాయట. ఇక కిస్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను నేనే డైరెక్ట్ చేశాను. ఆ సినిమా నాకు ఒక గుణపాఠం. దాని వల్ల ఎంతో నష్టాన్ని చూశాను అంటే.. కనీసం రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. అందుకే చేయవద్దని అనుకున్న కొన్ని సినిమాలు ఆర్థికంగా బావుండాలని చేశాను.. అంటూ అడివి శేష్ క్లారిటీ ఇచ్చాడు.

    నెక్స్ట్ మెహర్ ఉన్నికృష్ణన్ బయోపిక్

    నెక్స్ట్ మెహర్ ఉన్నికృష్ణన్ బయోపిక్

    ఇక నెక్స్ట్ ఈ హీరో మెజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ బాబు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా ముంబై దాడుల్లో పోరాడిన అన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా నేడు శేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. వచ్చే ఏడాది తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

    English summary
    Telugu box office hit movie Evaru is all set to be remade in sandalwood. Young kannada actor Diganth will reprise Sesh’s role, while the name of the actress who will play Regina’s role is yet to be announced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X