"ప్రభాస్‌ను మించిన మంచోడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు"
Recommended Video
అడవి శేష్ హీరోగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్ ఇండస్ట్రీలో తన అనుభవాలను పంచుకున్నారు.
ఇందులో భాగంగా రాపిడ్ ఫైర్ రౌండ్లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన టాప్ స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నలకు శేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఇంటలిజెంట్ యాక్టర్ అని, రవితేజ సెట్లో ఉంటే సూపర్ ఫన్నీగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

శర్వాతో పెద్దగా పరిచయం లేదు
శర్వానంద్ గురించి అడిగిన ప్రశ్నకు శేష్ రియాక్ట్ అవుతూ... శర్వాతో రన్ రాజా రన్ మూవీలో నటించినా ఇద్దరి మధ్య పెద్దగా షూటింగ్ జరుగలేదు. సినిమాలో మా ఇద్దరి ట్రాక్స్ వేరు, ఫార్మల్‌గా మాట్లాడేవారం. కానీ పెద్దగా పరిచయం లేదు. అయితే నా ఫిల్మ్ సక్సెస్ అవ్వగానే ఆయన నుంచి తప్పకుండా మెసేజ్ వస్తుంది, నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడని తెలిపారు.

ప్రభాస్‌ను మించిన మంచోడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు
ప్రభాస్ నిజంగానే డార్లింగ్ హార్ట్. పెద్ద స్టార్లు అందరిలో పెద్ద మనసు ఆయనదే అనడంలో డౌట్ లేదు. బాహుబలి సమయంలో ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. కొన్ని సార్లు మనం చనువు పెరిగేకొద్దీ ప్రశ్నలు మనకు నచ్చినట్లు అడిగేస్తాం. నేనూ అలాగే అడుగుతున్నప్పుడు... ఏంటి ఇలా అడిగేస్తున్నాడని పక్కనుంచి కొందరు లుక్కులు ఇస్తున్నా ఆయన నాకు ఓపికగా సమాధానం చెప్పేవారు. నా దృష్టిలో ఆయన జెన్యూన్, నైస్ గయ్.

రానా దేన్ని అయినా ఎక్కడికైనా తీసుకెళ్లగలడు
రానా అంటే ఎంటర్‌ప్రైజింగ్. ఆయన దేన్ని అయినా ఎక్కడికైనా తీసుకెళ్లగలడు. దాన్ని మార్కెటింగ్ అనాలా? ఎనర్జీ అనాలా? తెలియడం లేదు. బాహుబలి లాంటి మూవీ బిగ్ రేంజికి వెళ్లాయంటే కారణం రానా. తెలుగు వాళ్ల థాట్స్ హిందీ దాకా తీసుకెళ్లగలిగాడు. కరణ్ జోహార్, శోభుగారిని కనెక్ట్ చేసింది ఆయనే అని విన్నాను.

సమంత, మంచు లక్ష్మి గురించి...
మంచు లక్ష్మి గారు చాలా మంచి అమ్మాయి. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అమెరికాలో మేము ఉన్నప్పటి అనుభవాలను పంచుకునేవారం. వాళ్ల కూతురు విద్యా నిర్వాణ అంటే చాలా ఇష్టం. సమంత గురించి చెప్పాలంటే మామూలు టాలెంట్ కాదు, బీభత్సమైన టాలెంట్.... అని అడవి శేష్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











