విడుదల కంటే 10 రోజుల ముందే మేజర్ సినిమా అడ్వాన్స్ షోలు.. మహేష్ బాబు స్కెచ్ అదిరింది!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న యువ హీరో అడవి శేష్ మొదటిసారి ఒక రియల్ హీరో బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో మరణించిన భారత జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాకు శశికిరణ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మేజర్ సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
తప్పకుండా మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని కూడా చెబుతున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మహేష్ బాబు మేజర్ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే మేజర్ సినిమా కు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర నిర్మాతలు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అసలైతే ఈ సినిమాను జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

అయితే ఆ రిలీజ్ డేట్ కంటే పది రోజుల ముందే మేజర్ సినిమాను దేశవ్యాప్తంగా 9 ప్రధానమైన సిటీస్ లో అడ్వాన్స్ షోలను వేయబోతున్నారు. మేజర్ ప్రీ రిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ కు సంబందించిన అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేకమైన షో లకు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ ట్రైలర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఎంతో బావోద్వేగాన్ని కూడా కలిగించాయి.
ఇక మేజర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఈ తరహా ప్రణాళికకు సిద్ధమయ్యారు. తప్పకుండా ఈ అడ్వాన్స్ షోలతో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది అని ఆ తర్వాత గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











