సస్పెన్స్‌కు తెరలేపిన అడవి శేష్: నాకిష్టమైన ప్రొడ్యూసర్ అని చెబుతూ ఆసక్తిని పెంచాడు
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇంకొందరైతే ప్రత్యేకమైన శైలితో పేరు సంపాదించుకుంటారు. ఈ రెండు కోవలకూ చెందిన వాడే అడవి శేష్. పవన్ కల్యాణ్ 'పంజా' సినిమాలో విలన్‌గా నటించి పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత రవితేజ 'బలుపు' సహా మరికొన్ని చిత్రాల్లో ప్రతి నాయకుడిగా చేశాడు. ఇక, హీరోగా మారిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు.
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో విజయాలను అందుకుని దూకుడు మీదున్న అడవి శేష్.. ప్రస్తుతం 'మేజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా 'మేజర్ షూటింగ్ పూర్తయిన వెంటనే నేను చేయబోయే సినిమాను రేపు ప్రకటించబోతున్నాం. డైరెక్టర్‌తో పాటు ఆ టీమ్ కూడా సూపర్ ఉంటుంది. కానీ, ప్రొడ్యూసర్ మాత్రం నా ఫేవరెట్. రెడీగా ఉండండి' అంటూ వెల్లడించాడతను. దీంతో ఆ దర్శకుడు, నిర్మాత ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఇక, ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే 'మేజర్'. శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అడవి శేష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం 2021, జూలై 2న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











