అంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా?.. సుప్రియతో పెళ్లిపై అడివి శేషు స్పందన
యువ హీరో అడవి శేషు, నిర్మాత, నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ పెళ్లి వార్త టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ ఏడాది తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. గత కొద్దికాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లకు తాజా వార్త బలకలిగించేలా మారింది. అయితే తన పెళ్లిపై వచ్చిన వార్తలపై హీరో అడవి శేషు స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

సుప్రియతో అడవి శేషు డేటింగ్ వార్తతో
గత కొద్దికాలంగా అడివి శేషు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. గతేడాది విడుదలైన గూఢచారి చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. అడవిశేషు, శోభితా ధూళిపాళ, సుప్రియా యార్లగడ్డ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆర్థికంగాను విజయం సాధించింది. ఈ క్రమంలో సుప్రియతో అడవి శేషు డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్త ఆసక్తిని రేపింది.

సమంత అక్కినేని చొరవ
అడవి శేషు, సుప్రియా రిలేషన్‌షిప్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ అంతగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కానీ వీరిద్దరి పెళ్లికి నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత చొరవ తీసుకొంటున్నారనే కోణంలో వార్త రావడం మరింత సంచలనం రేపింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ పెళ్లి జరుగబోతున్నదనే వార్త మరింత ఆసక్తిని కలిగించింది.

ఆ రిలేషన్‌తోనే సమంత అక్కినేని
అక్కినేని కోడలు సమంతకు అడివి శేషు, సుప్రియ మధ్య మంచి స్నేహం ఉంది. ఆ కారణంగానే ఆమె వారిద్దరిని కలిపేందుకు ప్రయత్నించారనేది సినీ వర్గాల్లో టాక్. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలను బాధ్యతను సమంత భుజాన వేసుకొన్నట్టు తెలిసింది. గతంలో సుప్రియకు ఓ హీరోతో పెళ్లి అయింది. అయితే దురదృష్ణవశాత్తు భర్త చనిపోవడంతో కూతురుతో కలిసి ఒంటరిగానే ఉంటున్నారు.

సినీ హీరో అడవి శేషు స్పందన
తన పెళ్లిపై ఇలాంటి వార్తలు మీడియాలో చెలరేగుతుంటే అడవి శేషు స్పందించకతప్పలేదు. సోషల్ మీడియాలో అడివి శేషు వివరణి ఇచ్చారు. అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకొంటున్నాను. నా జీవితంలో సినిమాలకు తప్ప మరొక విషయానికి చోటులేదు. నటన, రచన, నా కలలను సాకారం చేసుకొనే అంశాల కంటే ప్రేమ గొప్పదా? అని అడివి శేషు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
Recommended Video


నా లక్ష్యం వైపుకు ఇలా
సినీ జీవితానికి సంబంధించి నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని చేరుకోవడానికి తల దించుకొని పనిచేస్తున్నా. ప్రతిక్షణం కష్టపడుతున్నాను. ప్రతీ రోజు ఏదో మంచి పనిచేయడానికి శ్రమిస్తున్నాను. నా జీవితంలో మంచి విషయాలకు చోటివ్వడానికి కృషి చేస్తున్నాను అని అడివి శేషు ట్వీట్ చేశారు.

గూఢచారి సీక్వెల్ కొరకు
ప్రస్తుతం గూఢచారి మూవీకి సంబంధించిన సీక్వెల్‌కు తెరరూపం ఇచ్చే పనిలో అడివి శేషు ఉన్నాడు. ఈ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. గూఢచారి కంటే మరింత థ్రిల్లింగ్‌గా, ఆసక్తిగా ఉంటుందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











