Adivi Sesh సన్నీ లియోన్‌కు అడివి శేష్‌కు ఏంటి సంబంధం.. ఆమె కారణంగా పేరు మార్చుకోన్నాడా?
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది పాత పేర్లు కలిసిరాక తమ పేర్లలో అక్షరాలను తీసెయ్యడమో.. కలపడమో చేస్తారు. కానీ, హీరో అడివి శేష్ మాత్రం హీరోయిన్ సన్నీలియోన్ వలనే తాను పేరు మార్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అసలు ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం.
అడివి శేష్.. తెలుగులో విలక్షణమైన హీరోల్లో ఒకడు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తితో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. సొంతం సినిమాలో ఒక చిన్న పాత్రలో మొదటిసారి శేష్ వెండితెరపై కనిపించాడు. ఇక దీని తరువాత అవకాశాల కోసం తిరిగినా ఎవరు పట్టించుకోకపోయేసరికి. తానే నిర్మాతగా, డైరెక్టర్ గా ఒక కథను రాసుకొని కర్మ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ విభిన్నమైన కథగా ప్రేక్షకులు ఆదరించారు.

కర్మ సినిమా తరువాత శేష్ కు అనుకోకుండా పంజా సినిమా ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శేష్ .. విలన్ గా కనిపించాడు. పంజా సినిమా శేష్ జీవితంలో ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. అతడి విలనిజానికి అభిమానులు ఫిదా అయ్యారు. పంజా సినిమా హిట్ కాలేదు కానీ శేష్ కు మాత్రం వరుస అవకాశాలను తీసుకొచ్చి పెట్టింది. పంజా తరువాత బలుపు, బాహుబలి లాంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.
విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న సమయంలోనే శేష్.. తనలో ఉన్న రచయితను నిద్రలేపాడు. ఒక మంచి కథను రాసుకొని హీరోగా లాంచ్ అయ్యాడు. అదే క్షణం. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్నిఅందుకోవడంతో ఈ కుర్ర హీరో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గూఢచారి సినిమాతో శేష్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఎవరు, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం గూఢచారి 2 సినిమాతో బిజీగా ఉన్న అడివి శేష్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పుకొచ్చాడు. శేష్ అసలు పేరు అడివి సన్నీ చంద్ర. చిన్నతనము నుంచి అమెరికాలోనే పెరగడంతో అక్కడే చదువును పూర్తిచేశాడు. ఇక అప్పట్లో అమెరికాలో శృంగార తార సన్నీ లియోన్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో స్కూల్ లో శేష్ ఫ్రెండ్స్ అందరూ అతనిని సన్నీ , సన్నీ అని ఏడిపించేవారట. ఆ టార్చర్ భరించలేక శేష్ వాళ్ల నాన్నగారితో తన పేరు మార్చుకుంటానని చెప్పాడట.
స్కూల్ లో అందరూ సన్నీ సన్నీ అని ఏడిపిస్తున్నారు.. నేను పేరు మార్చుకుంటాను అనగానే.. నాన్న, అయితే శేష్ అని పెట్టుకో అన్నారు. అదేంటి అంటే.. నాకు సునీల్ గవాస్కర్ అంట ఇష్టంతో నీకు సన్నీ అని పేరు పెట్టాను. నీ పేరు శ అనే అక్షరంతో రావాలని పంతులు చెప్పారు. అందుకే శేష్ అని పెట్టుకో అని నాన్న చెప్పారు. అప్పటినుంచి నా పేరు అడివి శేష్ గా మారింది" అని చెప్పుకొచ్చాడు. అలా సన్నీ లియోన్ వలన శేష్ పేరు మారింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











