twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడివి శేష్ కు కరోనా.. ఆ సినిమాలు చూడమంటూ ట్వీట్!

    |

    మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాతో ఇటీవలే అడవి శేష్ సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి మరిన్ని వసూళ్లు సాధిస్తూ భారీ లాభాలను సాధించి హాట్ టాపిక్ గా మారింది. మేజర్ సినిమాతో హిట్ కొట్టిన అడవి శేష్ తాజాగా తాను కరోనా బారిన పడ్డానని చెబుతూ కొన్ని సినిమాలు చూడమని సజెస్ట్ చేశాడు. నిజానికి ఎలా అయినా హీరో అవ్వాలనే ఉద్దేశంతో అమెరికాలో చదువు పూర్తి చేసి తిరిగి ఇండియా వచ్చి నటుడు అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు అడివి శేష్.

    అందులో భాగంగా ఆయన ముందుగా పంజా లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. అయినా సరే ఏ మాత్రం నిరాశ చెందకుండా క్షణం అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే హీరోగా క్షణం సినిమాతో పేరు తెచ్చుకున్న అడవి శేషు ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

    అందులో భాగంగా అడివి శేష్ గూడచారి, ఎవరు వంటి సినిమాలతో హిట్ కొట్టి ఎప్పటి నుంచో తన మదిలో ఉన్న ఒక సబ్జెక్ట్ ను పట్టాలు ఎక్కించారు. ముంబై ఉగ్రవాద దాడుల్లో మరణించిన కేరళకు సంబంధించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఆయన ఒక సినిమా తెరకెక్కించాలని అనుకుని, ఆ ఐడియాను మహేష్ బాబు ముందుకు తీసుకు వెళ్ళగా ఆయన నిర్మించేందుకు ఒప్పుకోవడంతో సినిమా నిర్మాణం ప్రారంభమైంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

    adivi sesh urges audience to watch bimbisara and sita ramam

    నిజానికి అడివి శేష్ మేజర్ సినిమా తరువాత వెంటనే హిట్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా సోకడంతో ఐసొలేషన్‌లో ఉన్నారట, ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో ఈ రోజు రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు బింబిసార, సీతారామం చిత్రాలను చూడమని తన అభిమానులకు సలహా ఇచ్చారు. "బింబిసార, సీతారమం.. ఈ రెండింటికీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. వెంటనే ఈ రెండు సినిమాలను మార్నింగ్ షో ఒకటి, మ్యాట్నీ ఒకటి నా కోసం చూసేయ్యండి అని ఆయన కోరారు. కరోనా వల్ల థియేటర్లకు వెళ్లలేకపోతున్నానని తన స్నేహితులు నటించిన మూవీని తప్పకుండా చూడాలని ఆయన్ కోరారు.

    English summary
    adivi sesh urges audience to watch bimbisara and sita ramam through his social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X