Srinath Maganti నీవు నాకు పోటీ కావాలి.. మాగంటి శ్రీనాథ్‌కు అడివి శేష్ ప్రశంసలు
బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్, సమయం, కమిట్‌మెంట్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకొన్న యువ హీరో మాగంటి శ్రీనాథ్. ఆయన కీలక పాత్రలో కనిపించిన హిట్ 2 చిత్రం ట్రైలర్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అడివి శేషు, శైలేష్ కొలను, మీనాక్షి చౌదరీ, మాగంటి శ్రీనాథ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో అడివి శేష్ మాట్లాడుతూ. శ్రీనాథ్‌పై ప్రశంసలు కురిపించారు.
హిట్ 2 ట్రైలర్ ఆవిష్కరణ తర్వాత యువ హీరో శ్రీనాథ్ మాట్లాడుతూ.. హిట్ యూనివర్స్‌లోకి రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ శైలేష్. ఆయన ఈ సందర్భంగా ఎన్నిసార్లు థ్యాక్యూ చెప్పుకొన్న తక్కువే. శేషుతో నటించడం గొప్ప అనుభూతి. సెట్స్‌లో మీతో పంచుకొన్న విషయాలు ఇంకా నా గుర్తుకు ఉన్నాయి. మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన వాల్ పోస్టర్ బ్యానర్, నానీ, ప్రశాంతికి థ్యాంక్స్ అని అన్నారు.

హిట్ 2 సినిమాలో శ్రీనాథ్ యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. ట్రైలర్‌లో చూపించకలేకపోయాం. తన లుక్స్ బాగున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాకు మంచి పోటీ ఇవ్వాలని కోరుకొంటున్నాను. రానున్న రోజుల్లో నాకు కాంపిటిషన్ ఇవ్వాలని కోరుకొంటున్నాను అని అడివి శేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











