12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఢీ కాంబినేషన్.. ప్రకటించిన మంచు విష్ణు!

మంచు విష్ణు, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఢీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. శ్రీనువైట్ల మార్క్ కామెడీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలించింది. అప్పట్లో వరుస విజయాలతో శ్రీనువైట్ల మంచి జోరుమీద ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శ్రీనువైట్ల వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. శ్రీనువైట్ల చివరగా తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

దీనితో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా 12 ఏళ్ల తర్వాత ఢీ కాంబినేషన్ సెట్ అయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండవసారి నటించబోతున్నట్లు మంచు విష్ణు స్వయంగా ప్రకటించాడు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంచు విష్ణు ఈ ప్రకటన చేశాడు. రెడీ, ఢీ, వెంకీ లాంటి విజయాలతో శ్రీనువైట్ల స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. తన చిత్రాల్లో శ్రీనువైట్ల హాస్యానికి పెద్ద పీట వేసేవారు. ఆ ఫార్ములా బాగా వర్కౌట్ అయ్యేది.

After 12 years gap Srinu Vaitla, Manchu Vishnu will going to team up for second time

దూకుడు చిత్రం తర్వాత శ్రీనువైట్ల స్థాయి మరింతగా పెరిగింది. కానీ ఆగడు చిత్రం నుంచి శ్రీనువైట్ల ప్లాపుల పరంపర మొదలయింది. పరాజయాల నుంచి బయట పడడానికి శ్రీనువైట్ల ప్రయత్నిస్తున్నారు. ఇక మంచు విష్ణుకి కూడా ఇటీవల సరైన సక్సెస్ లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X