#KA అల్లు అర్జున్, తేజా సజ్జా దారిలో కిరణ్ అబ్బవరం.. అలాంటి డేరింగ్ స్టెప్‌తో
ప్రస్తుతం టోటల్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గరే మన తెలుగు సినిమాలు ఏ రేంజ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ బడ్జెట్ అండ్ కంటెంట్ తో మన సినిమాలు డెలివర్ అవుతుంటే వసూళ్లు కూడా అదే రీతిలో భారీ లెవెల్లో వస్తున్నాయి. దీనితో మన సినిమాల ధైర్యంతో మరిన్ని భాషలు నుంచి పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు వెళుతున్నాయి.
అయితే పాన్ ఇండియా మార్కెట్ లో అందరికీ గేట్లు తెరిపించిన వన్ అండ్ ఓన్లీ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. తన బాహుబలి సినిమాలని పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ చేసిన విధానం అవి ఆడిన తీరు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళికి తన హీరోలకి ఒక బ్రాండ్ ని తెచ్చి పెట్టాయి. అయితే రాజమౌళి బ్రాండ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడం అనేది చాలా పెద్ద విషయమే అని చెప్పుకోవాలి.

మరి ఆ బ్రాండ్ ని దాటి పాన్ ఇండియా ఇమేజ్ ని మన టాలీవుడ్ నుంచి అందుకున్న ఏకైక హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ కి పుష్ప సినిమా విడుదల తోనే ఏమీ పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేయలేదు. తన గత చిత్రాలు హిందీలో యూట్యూబ్ టెలివిజన్ స్క్రీన్ పై అక్కడి స్టార్ హీరోస్ రేంజ్ లో చూసేవారు. ఈ రకంగా అల్లు అర్జున్ తనకి తానే టెస్ట్ పెట్టుకొని ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా పాన్ ఇండియా ఐకాన్ గా మారారు.
అయితే తన తర్వాత అలా రాజమౌళి బ్రాండ్ లేకుండా తన సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసే ప్రయత్నాన్ని యంగ్ హీరో తేజ సజ్జ చేసాడు. "హనుమాన్" అనే యూనివర్సల్ కాన్సెప్ట్ తో వెళ్లిన తాను కూడా పాన్ ఇండియా దగ్గర హిట్ అయ్యాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కాకుండా మరో యంగ్ హీరో తన పాన్ ఇండియా ఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఆ హీరోనే యువ నటుడు కిరణ్ అబ్బవరం.

కాగా తనకి అలాంటి ఇమేజ్ గత సినిమాలు లేకపోయినప్పటికీ కంటెంట్ తో పాన్ ఇండియా సక్సెస్ అవుతానని అంటున్నాడు. అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ తన సినిమా "క" తో పాన్ ఇండియా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. మరి ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ తో కిరణ్ అబ్బవరం సక్సెస్ అవుతాడా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం చిత్ర యూనిట్ అంతా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.
ఇక ఈ సినిమాని సుజీత్ మరియు సందీప్ లు రచన దర్శకత్వం వహించగా లేటెస్ట్ గా వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అలాగే ఈ సినిమాని చింత గోపాల్ కృష్ణ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే తమిళ టాలెంటెడ్ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











