ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అవతారం పూర్తిగా మారిపోయిందిగా... (న్యూ లుక్)

పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ఒకే రకమైన లుక్‌లో కనిపిస్తూ వచ్చారు. భారీగా పెరిగిన గడ్డం, ఖాదీ దుస్తుల్లోనే ఆయన దర్శనమిచ్చారు. ఒకప్పుడు తమ అభిమాన నటుడిని ఎంతో స్టైలిష్‌గా చూసిన ఫ్యాన్స్ ఆయన రొటీన్ లుక్ చూసి బోర్ ఫీలయ్యారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణులు, అభిమానులతో పవన్ కళ్యాణ్ వరుస మీటింగులు నిర్వహించారు. ఓటమి బాధలో ఉన్న అభిమానులను ఓదార్చారు. అప్పుడు కూడా పవన్ అవతారం ఏ మాత్రం మారలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొత్త అవతారంలో పవన్ కల్యాణ్

కొత్త అవతారంలో పవన్ కల్యాణ్

చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఖాదీ దుస్తులు కాకుండా... ఫార్మల్ డ్రెస్సులో కనిపించారు. కలర్ ఫుల్ చెక్స్ షర్ట్, షేడెడ్ జీన్స్‌లో దర్శనమిచ్చారు. గడ్డం పూర్తిగా తీయకుండా ట్రిమ్ చేసి ఉన్న ఈ అవతారం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒక స్కూలు పాపతో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ బయటకు వచ్చింది.

సినిమాల కోసం కాదు

సినిమాల కోసం కాదు

పవన్ కళ్యాణ్ గెడ్డం తీసింది, కలర్ ఫుల్ డ్రెస్సు వేసింది సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతో మాత్రం కాదు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నాయి. ఆయన పూర్తిగా రాజకీయాలకే అంకితం అయ్యారని, ఆయిన న్యూ లుక్ చూసి అభిమానులు ఎవరూ సినిమా రంగంలోకి వస్తారని ఊహించుకోవద్దని సూచిస్తున్నారు.

సినిమాలు చేయను అని తేల్చి చెప్పిన పవన్

సినిమాలు చేయను అని తేల్చి చెప్పిన పవన్

తనకు నటనపై ఆసక్తి లేదని, తిరిగి సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదని పవన్ కళ్యాణ్ ఇటీవల అభిమానులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. తన లక్ష్యం పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల తరుపున పోరాటం చేస్తూ ముందుకు సాగడమే అని స్పష్టం చేశారు.

నా శవాన్ని నలుగురు మోసే వరకు అంటూ..

నా శవాన్ని నలుగురు మోసే వరకు అంటూ..

నా శవాన్ని నలుగురు మోసే వరకు జనసేనను ముందుకు తీసుకెళతాను. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ ప్రతి ఒక్కరికి జనసేన గుర్తుకు వచ్చే విధంగా పని చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X