ఐదేళ్ల తర్వాత ఆ పని చేస్తున్న హీరో సిద్దార్థ్!
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'నిను వీడని నీడని నేనే'. హర్రర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ ఈ చిత్రానికి నిర్మాత కూడా. సందీప్ కిషన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇది. హర్రర్ తో పాటు ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింద.
హీరో సిద్దార్థ్ స్వతహాగా మంచి సింగర్ కూడా. సిద్దార్థ్ గతంలో బొమ్మరిల్లు, ఓయ్, ఓ మై ఫ్రెండ్ లాంటి చిత్రాలకు పాటలు పాడాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత సందీప్ కిషన్ కోసం మళ్లీ సింగర్ గా మారాడు. నిను వీడని నీడని నేనే చిత్రంలో సిద్దార్థ్ ఓ పాట పాడాడట. సోమవారం రోజే ఆ పాటని చెన్నైలో రికార్డ్ చేశారు. అన్యా సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

సిద్దార్థ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు సందీప్ కిషన్ మహా శివరాత్రి సందర్భంగా ప్రకటించాడు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వేంకటాద్రి టాకీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











