twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌లా ట్రై చేసిన మహేశ్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆ ఎపిసోడ్‌కు పూనకాలు ఖాయమట.!

    By Manoj
    |

    టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. బాల నటుడిగానే సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇక, 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయం అయినప్పటి నుంచే తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు నిరాశను మిగిల్చినప్పటికీ వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. తన ఫ్యాన్స్‌ను కాలర్ పైకెత్తుకుని తిరిగేలా చేయడానికి ఆయన ఎంతగానో శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలోనే మహేశ్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్రయోగం..? పూర్తి వివరాల్లోకి వెళితే..

    సరిలేరు అనిపించుకునేందుకు వస్తున్నాడు

    సరిలేరు అనిపించుకునేందుకు వస్తున్నాడు

    సూపర్ స్టార్ మహేశ్ బాబు.. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

    అన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్

    అన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్

    సరిలేరు నీకెవ్వరు నుంచి విడుదలయ్యే ప్రతి పాటకూ, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయగా.. వారానికి ఒకటిగా విడుదలవుతున్న పాటలు కూడా మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా మొదటి పాటకు 24 గంటల్లో 9.2 మిలియన్ల వ్యూస్‌ రావడం విశేషం.

    ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్కే

    ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్కే

    మహేశ్ బాబు వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండింటి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘సరిలేరు నీకెవ్వరు'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలని ఈ సూపర్ స్టార్ భావిస్తున్నాడు. అందుకోసం గతంలో ఎన్నడూ చేయని విధంగా ఎన్నో ప్రయోగాలను చేస్తున్నాడు.

    ఆల్రెడీ అందులో కుమ్మేశాడు

    ఆల్రెడీ అందులో కుమ్మేశాడు

    ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో మహేశ్ బాబు తప్ప మిగిలిన చాలా మంది డ్యాన్స్‌లు ఇరగదీస్తారన్న టాక్ ఉంది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇది ఒక లోటుగా మారిపోయింది. దానిని బ్రేక్ చేసేందుకు మహేశ్.. సరిలేరు నీకెవ్వరులో అదిరిపోయే స్టెప్పులు వేశాడని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ శిక్షణలో ఇప్పటికే ఈ పాటల చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది.

    ఎన్టీఆర్‌లా మహేశ్.. పూనకాలు ఖాయమట

    ఎన్టీఆర్‌లా మహేశ్.. పూనకాలు ఖాయమట

    ఈ సినిమాలో మహేశ్ బాబు రాయలసీమ యాసను ట్రై చేస్తున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ మాదిరిగా ఇందులో మహేశ్ మాట్లాడతాడట. అయితే, ఇది సినిమా మొత్తానికి కాదని, కేవలం కర్నూలులో జరిగే ఎపిసోడ్‌కు మాత్రమే పరిమితం అని తెలుస్తోంది. ఈ సీన్స్ అన్నింటికీ పూనకాలు ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

    English summary
    Tollywood Superstar Mahesh Babu New movie is Sarileru Neekevvaru. This Film Directed by Anil Ravipudi. In This Movie Mahesh act as major ajay Krishna. Now Intresting update of mahesh Sarileru Neekevvaru is out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X