Yash: KGF 2 తర్వాత ఎవరితో.. 700 కోట్లు కొల్లగొట్టినా మరో దర్శకుడు దొరకడం లేదా?

కన్నడ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్టు లేకుండా సోలో హీరోగా పైకొచ్చిన యష్ KGF సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును అందుకున్నాడు. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో యష్ మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అతనితో సినిమా చేసేందుకు అగ్ర దర్శకనిర్మాతలు కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే KGF చాప్టర్ 2 సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 700 కోట్లు కలెక్ట్ చేసి ప్రాఫిట్స్ లో కొనసాగుతోంది. అయితే యష్ ఇంకా తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కొంతమంది దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట సైడ్ హీరోగా..

మొదట సైడ్ హీరోగా..


కన్నడ చిత్ర పరిశ్రమలో మొదట ఒక సైడ్ హీరోగా చిన్న అవకాశాలు అందుకుని ఆ తర్వాత మెల్లగా లవర్ బాయ్ గా ఆ తర్వాత మాస్ హీరోగా యష్ తన స్టార్ ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో వారసులు ఒక రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి వారి కంటే భిన్నంగా తన మార్కెట్ ను పెంచుకున్నాడు యష్.

కష్టపడి సక్సెస్ కొట్టాడు..

కష్టపడి సక్సెస్ కొట్టాడు..


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా చేయాలని మొదట ఫిక్సయిన యష్ ఆ దర్శకుడి ఆలోచన తగ్గట్టుగా తానను తాను ఎంతగానో మార్చుకున్నాడు. KGF 1 సినిమా సక్సెస్ అవడంతో అతని క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. సెకండ్ చాప్టర్ కోసం కూడా అదే తరహాలో కష్టపడి సక్సెస్ కొట్టాడు. కమిట్మెంట్ కోసం కన్నడ చిత్ర పరిశ్రమలో మరి కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఒప్పుకోలేదు.

 బిగ్గెస్ట్ హిట్

బిగ్గెస్ట్ హిట్


కమిట్మెంట్ తో KGF 2 సినిమా కోసం మరొక సినిమాను కూడా ఓకే చేయలేదు. ఇక KGF చాప్టర్ 2 సక్సెస్ అవడమే కాకుండా ప్రస్తుతం ప్రాఫిట్స్ లో కొనసాగుతోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700కోట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో యష్ మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పాలి. దీంతో యష్ తో సినిమా చేయాలని ప్రముఖ నిర్మాతలు పోటీపడుతున్నారు.

కాంప్రమైజ్ కావద్దని..

కాంప్రమైజ్ కావద్దని..

ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో అయితే ఒకరిద్దరు దర్శకులు యష్ తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందులో జేమ్స్ దర్శకుడు చేతన్ ఉన్నాడు. అయితే యష్ కేజిఎఫ్ తర్వాత వచ్చే సినిమా అంతకు మించి అనేలా ఉండాలి అని మళ్ళీ లోకల్ సినిమాలు చేయకుండా పాన్ ఇండియా బాటలోనే కొనసాగాలని ఆలోచిస్తున్నాడు. కథల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు అని కూడా అనుకుంటున్నాడు.

గతంలో పూరితో చర్చలు?

గతంలో పూరితో చర్చలు?

గతంలో పూరీ జగన్నాథ్ కూడా యష్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ కథ విషయంలో కాస్తా డౌట్స్ ఉండడంతో పూరి మళ్ళీ అతని వైపు తిరిగి చూడలేదు. అలాగే యష్ సినిమా చేయాలని కొంత మంది బాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ హీరో మాత్రం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక యష్ తదుపరి సినిమా విషయంలో త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X