RIP Legend: ఆ దర్శకుడు రాగానే కన్నీళ్ళు ఆపుకోలేకపోయిన మహేష్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు మంగళవారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణించినట్లు తెలియగానే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అభిమానులు అందరూ కూడా ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో స్పందించారు. అయితే మరి కొంతమంది సినీ తారలు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా కృష్ణ గారి భౌతిక కాయానికే నివాళులర్పించేందుకు పద్మలయ స్టూడియో కు వెళ్లడం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని ప్రత్యేకంగా పరామర్శించడం జరిగింది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబు తోనే చాలాసేపు అక్కడే ఉన్నారు. మరి కొంతమంది దర్శకులు సినిమా నటులు కూడా ప్రత్యేకంగా మహేష్ బాబును కలవడం జరిగింది. అల్లు అర్జున్, జూనియర్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వెంకటేష్ కూడా హుటాహుటిన బయలుదేరి మహేష్ బాబును ప్రత్యేకంగా ఓదార్చారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

After krishna death Mahesh babu very emotional moment with k raghavendra rao

ఇక కృష్ణ గారితో వారికి ఉన్న అనుబంధం గురించి కూడా మీడియాతో పంచుకున్నారు. అయితే అందరినీ కూడా కలుసుకున్న మహేష్ బాబు ఒక దర్శకుడిని చూడగానే మాత్రం చాలా కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనతో మహేష్ బాబుకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ దర్శకుడు మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన కే రాఘవేంద్రరావు. ఆయన మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడు కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ ఆ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు ప్రత్యేకంగా మహేష్ కెరియర్ ను నీకు అప్పగిస్తున్నాను అని రాఘవేంద్రరావు చేతుల్లో చేయి పెట్టడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో కె రాఘవేంద్రరావు ఆ విషయాన్ని తెలియజేశారు. ఇక రాఘవేంద్రరావు కూడా మహేష్ బాబును ఒక తనయుడి తరహాలోనే ట్రీట్ చేసేవారు. ఇక ప్రత్యేకంగా కృష్ణ గారికి నివాళులర్పించేందుకు రాగా రాఘవేంద్రరావుని చూసి మహేష్ బాబు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను కూడా కంటతడి పెట్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X