ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తన్నారు. ఆయన నటిస్తున్న 'మహర్షి' మూవీకి సంబంధించిన పనులు ఏప్రిల్ 20తో ముగియనుండటంతో ఆ వెంటనే ఓ 10 రోజులు కుటుంబంతో విదేశాలకు వెళ్లి సేదతీరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తన సినిమా సినిమాకు గ్యాపులో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లడం మహేష్ బాబు అలవాటు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈ సారి వారు ఎక్కడికి వెళ్లబోతున్నారు? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 'మహర్షి' మూవీ ప్రమోషన్లలో మహేష్ బాబు బిజీ కాబోతున్నారు.
ఇటీవల ఉగాది సందర్భంగా విడుదలైన మహర్షి టీజర్ 24 గంటల్లో 12.6 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను పక్కకు నెట్టేసింది. టీజర్లో మహేష్ బాబు స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ థ్రిల్లవుతున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో తెరకెక్కించారో టీజర్లనే స్పష్టం అవుతోంది. అతడి టేకింగ్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుండగా అల్లరి నరేష్, మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అశ్వినీ దత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'మహర్షి' చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భారీ కలెక్షన్లు సాధించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











