‘మజిలీ’ ఎఫెక్ట్... ఇకపై రూ. కోటి ఎక్స్‌ట్రా చార్జ్ చేయనున్న చైతు?
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఖాతాలో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ విజయం పడింది. చైతు, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసింది.
'మజిలీ' విజయం తర్వాత ఇటు చైతన్యతో పాటు అటు సమంత కూడా తమ రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. ఇకపై చైతన్య తను చేయబోయే సినిమాలకు ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే రూ. 1 కోటి ఎక్కువ చార్జ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సమంత కూడా తన రెమ్యూనరేషన్ హైక్ చేసినట్లు టాక్.

ప్రస్తుతం చైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి 'వెంకీమామ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 'మజిలీ' కంటే ముందే కమిటైన చిత్రం కాబట్టి అప్పుడు నిర్ణయించిన రెమ్యూనరేషనే తీసుకుంటున్నాడట. అయితే నెక్ట్స్ 'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతితో సినిమాకు మాత్రం పెంచిన రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట.
అజయ్ భూపతి చెప్పిన కథ సమంతకు కూడా బాగా నచ్చడంతో హీరోయిన్‌గా ఆమెనే తీసుకునే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చైతన్య, సమంత ఆలోచించుకుని నిర్ణయం చెబుతామని వెల్లడించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











