ఇలా పెళ్లైంది.. అప్పుడే భర్తతో చెప్పులు మోయించిన స్టార్ హీరోయిన్
నార్త్ ఇండియా సినిమా దగ్గర మంచి పాపులర్ అయినటువంటి స్టార్ హీరోయిన్స్ లో చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. కాగా ఈ హీరోయిన్స్ లో ఎప్పుడో సినిమా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారూ ఉన్నారు అలాగే పెళ్లి చేసుకోని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఐతే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్స్ లో ఒకరైన స్టార్ బ్యూటీనే సోనాక్షి సిన్హా.
కాగా సోనాక్షి సిన్హా ఎప్పుడో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి బాలీవుడ్ టాప్ స్టార్స్ తో స్క్రీన్ పంచుకుంది. ఇక ఏజ్ అయ్యేసరికి తనకంటే వయసులో కాస్త చిన్న వాడే అయినా జహీర్ ఇక్బాల్ ని ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఈ జూన్ 23న ఈ ఇద్దరి పెళ్లి ముంబై లో జరుగగా ఇద్దరు కుటుంబ పెద్దలూ పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు.

అయితే వీరి పెళ్ళికి ముందు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ పై సోనాక్షి కాస్త ఘాటుగా స్పందించడం ఆమె పెళ్లి విషయం తన తల్లికి సోదరుడికి ఇష్టం లేదని మరికొన్ని న్యూస్ లు రావడంతో సోనాక్షి పెళ్లి మంచి హాట్ టాపిక్ గా మారింది. కానీ ఫైనల్ గా కుటుంబ సభ్యుల నడుమ ఎలాంటి విభేదాలు లేవని బయటకి వచ్చిన కొన్ని ఫోటోలు చూస్తే అందరికీ అర్ధం అయ్యింది.
కాగా వీరి పెళ్లి అయిపోయింది కేవలం కొన్ని రోజులే గడిచాయి. అప్పుడే తన భర్తతో ఆమె తన చెప్పులు మోయించడం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే ఇదేమి సీరియస్ గా కాదు కానీ తన భార్య చెప్పులు మోసే భర్త దొరకడం అదృష్టం అన్నట్టుగా సోనాక్షి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో స్టోరీ పెట్టింది. దీనితో ఇది సినీ వర్గాల్లో ఫన్నీగా వైరల్ గా మారింది.

పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా భర్తతో చెప్పులు మోయిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కాగా సోనాక్షి సిన్హా అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు నటించిన చిత్రం "బడే మియా చోటే మియా" సినిమాలో కనిపించగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన అవైటెడ్ వెబ్ సిరీస్ "హీరామండి" లో కూడా ముఖ్య పాత్ర ఆమె చేసి కనిపించింది.
ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండగా దీనికి ముందు "దహాడ్" అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా ప్రస్తుతం "కాకుడా" అనే హారర్ కామెడీ సిరీస్ ని చేసింది. ఇది జీ 5 లో అందుబాటులో ఉంది. ఇక ఇవి కాకుండా తదుపరి మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సోనాక్షి బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











