ఆ ఇద్దరి వల్లే నా జీవితం ఇలా.. యాక్సిడెంట్ తర్వాత షాకింగ్‌గా సాయిధరమ్ తేజ్ మెచ్యురిటీ

మెగా పాన్ ఇండియా రౌండ్ టేబుల్ పేరుతో గలాటా ప్లస్ నిర్వహించిన గతేడాది సినిమా పరిశ్రమలో చోటు చేసుకొన్న పరిస్థితులు, జయపజయాలపై జరిగిన చర్చ ఆసక్తికరంగా జరిగింది. సాయిధరమ్ తేజ్, శృతిహాసన్, శ్రీయా సరన్, శోభు యార్లగడ్డ, తరుణ్ భాస్కర్ లాంటి సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన అంశాలను అందర్నీ ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించిన అభిప్రాయాలు ఆయనలో మెచ్యురిటీని తెలియజేశాయి. ఆయన మాట్లాడుతూ..

గతేడాది అంటే 2023 సంవత్సరంలో సాయిధరమ్ తేజ్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం ఒడిదుడుకులతో సాగింది. యాక్సిడెంట్ తర్వాత ప్రశ్నార్థకంగా మారిన లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్న విధానం అతడిలోని ఆత్మస్థైర్యాన్ని చూపించింది. విపత్కర పరిస్థితులను ఎదురించి మళ్లీ ఆడియెన్స్ ప్రేమను ఆకట్టుకొన్న విధానం భేష్ అనిపించేలా ఉంది.

After Road accident, Sai Dharam Tej behaviour and Maturity revealed in Galata Mega Round Table

యాక్సిడెంట్‌తో తర్వాత విరూపాక్ష చిత్రం సక్సెస్ మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని సాయిధరమ్ తేజ్‌ చెప్పారు. సక్సెస్ కంటే కోమా నుంచి బయటపడటం ఆనందం కలిగింది. నా శ్రేయోభిలాషులు అందజేసిన సందేశాలు నాకు సంతోషాన్ని కలిగించడమే కాకుండా నిజమైన సక్సెస్‌గా నిలిచింది.

ప్రపంచ సినిమా గురించి, ఇండియన్ సినిమా గురించి సాయిధరమ్ తేజ్ వ్యక్తీకరించిన విలువైన అభిప్రాయలు అందర్నీ ఆలోచింపజేశాయి. ఇండియన్ సినిమాలో స్లో మోషన్స్ ఎమోషన్స్ రేకెత్తిస్తాయి. ఓ ఎక్సైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తాయి అని అన్నారు. స్లోమోషన్‌లో ఇండియన్ హీరోలను పరిచయం చేసే విధానం అద్వితీయంగా ఉంటుంది అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

After Road accident, Sai Dharam Tej behaviour and Maturity revealed in Galata Mega Round Table

పాన్ ఇండియా రౌండ్ టేబుల్ సమావేశంలో తన మామయ్యలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన జీవితాన్ని వారు తీర్చి దిద్దిన తీరు వల్లే తనకు ఇలాంటి హోదా వచ్చింది. నా కెరీర్‌ కోసం చేసిన ప్లానింగ్ వల్లే ఇలాంటి స్టార్ డమ్ వచ్చింది అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

ఇక నిర్మాత శోభు యార్లగడ్డ ప్లానింగ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రిపబ్లిక్ సినిమా షూట్ సమయంలో స్టోరి బోర్డ్, షాట్ డివిజన్ తదితర అంశాలు సినిమాకు ఎంతో హెల్ప్ చేశాయి. అంతేకాకుండా అనుకొన్న సమయాన్ని దాదాపు సగం మేరకు తగ్గించింది అని అన్నారు.

After Road accident, Sai Dharam Tej behaviour and Maturity revealed in Galata Mega Round Table

పోస్ట్ లాక్ డౌన్ తర్వాత ఆడియెన్స్ అభిరుచుల్లో వచ్చిన మార్పుల గురించి సాయిధరమ్ తేజ్‌కు ఉన్న అవగాహన అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీకి, ప్రపంచ సినిమాకు ప్రేక్షకుల దగ్గరయ్యారు. సినిమాల సంఖ్య కంటే వాటిలో క్వాలిటీ చూస్తున్నారు. దాంతో నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. బలమైన కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X