సరిపోదా శనివారం ముందు.. ఆ తర్వాత నాని రెమ్యునరేషన్ ఎంత? హ్యాట్రిక్‌తో నేచురల్ స్టార్ పారితోషికం ఎన్ని కోట్లంటే
ప్రెజెంట్ మన తెలుగు సినిమా దగ్గర చాలా మంది హీరోస్ ఉన్నప్పటికీ ఒక మినిమమ్ గ్యారెంటీ హీరో అని మాత్రం చాలా తక్కువ మందే కనిపిస్తారు అని చెప్పాలి. అది సీనియర్ హీరోలు అయినప్పటికీ మిడ్ రేంజ్ చిన్న హీరోలు అయినప్పటికీ అని చెప్పాలి. కాగా ఇలా ఉన్న అందరి హీరోస్ లో కూడా వినూత్న చిత్రాలతో మినిమమ్ గ్యారెంటీ బిజినెస్ ని వసూళ్ళని అందించే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ స్టార్ నాని అని చెప్పవచ్చు.
కెరీర్ ని చాలా చిన్నగా మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ టైర్ 2 లో టాప్ హీరోగా దూసుకెళ్తూ టైర్ 1 హీరోగా మారే లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరోగా మారుతున్నాడు. కాగా ఇప్పుడు నాని నటించిన తాజా చిత్రం "సరిపోదా శనివారం" పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా ట్రెండ్ చూస్తుంటే నాని కెరీర్ లో భారీ భారీ హిట్ గా నిలిచే దిశగా సినిమా వెళుతుంది.

ఓపెనింగ్స్ నే ఈ సినిమాకి 25 కోట్లకి పైగా రాగా దీనితో వరుసగా దసరా, హాయ్ నాన్న ఇప్పుడు సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసినట్టే అయ్యింది. అయితే టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోస్ లో నాని హైయెస్ట్ పైడ్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. వరుసగా హిట్స్ అందిస్తుండడంతో ఒకో సినిమాకి రెమ్యునరేషన్ ని పెంచుతూ వెళ్తున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం కి భారీ మొత్తంలో 25 కోట్లు పుచ్చుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది.
కాగా ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ తో తమ మార్కెట్ ని మరింత స్ట్రాంగ్ గా మార్చుకునేసరికి తన నెక్స్ట్ సినిమాలకి భారీ స్థాయిలో తన రెమ్యూనరేష ని హైక్ చేసినట్టుగా ఇపుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. నెక్స్ట్ సుజీత్ తో ఓ సినిమా అలాగే తన దసరా దర్శకుడుతో ఓ సినిమా నాని చేస్తుండగా వీటికి 30 కోట్ల చొప్పున ఛార్జ్ చేస్తున్నాడని తెలుస్తుంది.

దసరా, హాయ్ నాన్న వరుస హిట్లు సాధించాడు. తాజాగా సరిపోదా శనివారం హిట్‌తో హ్యాట్రిక్ సాధించాడు. దీనితో సరిపోదా శనివారం తర్వాత నాని 5 కోట్ల మేర తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడు అని చెప్పాలి. ఇపుడు నాని ఎలాగో తన మార్కెట్ ని నిలకడగా మైంటైన్ చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి పెంచడంలో తప్పు లేదని చెప్పొచ్చు. అలాగే ప్రెజెంట్ టైర్ 2 హీరోస్ లో నాని తీసుకుంటున్న మొత్తమే అత్యధికం అన్నట్టుగా కూడా టాక్.
విజయ్ దేవరకొండ, రామ్, నితిన్ లాంటి వారు అంతా కూడా నాని తర్వాతే ఉన్నారని తెలుస్తుంది. మరి సరిపోదా శనివారం తనకి మరో 100 కోట్ల సినిమాగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా ఆర్ ఆర్ ఆర్, ఓజి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











