ప్రభాస్ పెళ్లి మ్యాటర్... ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు
Recommended Video
ప్రభాస్ విషయంలో ప్రతి ఒక్క ఫ్యాన్ అడిగే మొదటి ప్రశ్న 'యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు?' ఈ విషయంలో గత కొన్నేళ్లుగా చర్చసాగుతూనే ఉంది. అయితే ప్రభాస్ మాత్రం దీన్ని ఎప్పటికప్పుడు సమాధానం దాటవేస్తూనే ఉన్నారు. మరో వైపు పెళ్లి విషయంలో రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.
ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెబుతారు? అంటూ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో కృష్ణం రాజుకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. ''ప్రభాస్ ఎప్పుడు చేసుకుంటే అప్పుడే పెళ్లి... ప్రస్తుతం మావాడి ఫోకస్ మొత్తం 'సాహో' రిలీజ్ మీదే ఉంది. ఈ సినిమా రిలీజైన తర్వాతే దాని గురించి ఆలోచిస్తాడు.'' అన్నారు.

ప్రభాస్‌కు అంత సమయం లేదు
ఒక్కో ప్రాజెక్ట్ నాలుగైదేళ్లు పడుతుంది. మొదట బాహుబలి, తర్వాత సాహో, నెక్ట్స్ మరోటి చేయబోతున్నాడు. ఇలా ప్రాజెక్టులకే ఫిక్స్ అయిపోతున్నాడే తప్ప పెళ్లి గురించి ఆలోచించడం లేదు... అని యాంకర్ ప్రశ్నించగా ‘సాహో' రిలీజ్ తర్వాత ప్రభాస్ కొంచెం ఫ్రీ అవుతాడు, ఆ తర్వాతే దీని పెళ్లి గురించి ఆలోచిస్తాడని కృష్ణం రాజు క్లారిటీ ఇచ్చారు.

అనుష్క పేరు, ఎన్ఆర్ఐ అమ్మాయి ఇలా చాలా పేర్లు తెరపైకి
అనుష్క పేరు, ఎన్ఆర్ఐ అమ్మాయి ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి కానీ, అవేవీ నిజం కాదు. కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పటి వరకు ప్రభాస్ కోసం మేము ఎవరినీ చూడలేదు, బయటి నుంచి కూడా ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. సాహో రిలీజ్ తర్వాత రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాతే దాని గురించి ఆలోచిస్తాడని కృష్ణం రాజు తెలిపారు.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ గోపీ కృష్ణ మూవీస్ బేనర్లో
‘సాహో' తర్వాత ప్రభాస్ మా గోపీకృష్ణ మూవీస్ బేనర్లో సినిమా చేయడానికి సబ్జెక్ట్ అంతా రెడీ అయింది. ఆగస్టు 30న సాహో విడుదలైన తర్వాత సెప్టెంబర్లో ఇంకోసారి రివైజ్ చేసుకుంటాం. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి నెక్ట్స్ మూవీ షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు.

సాహో
‘సాహో' మూవీ విషయానికొస్తే సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించగా నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











