అక్కినేని అభిమానులకు క్షమాపణ చెప్పిన ఏజెంట్ నిర్మాత.. టీజర్ వచ్చేది అప్పుడే అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా స్టార్ ఇమేజ్ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్న వారిలో యువ హీరో అక్కినేని అఖిల్ టాప్ లిస్టులో ఉన్నాడు అనే చెప్పాలి. ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవాలని మొదటి నుంచి బలమైన అడుగులు వేస్తున్నాడు. మొదటి సినిమా భారీ స్థాయిలో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు. ఇక ఆ తర్వాత విభిన్నమైన లవ్ స్టోరీలతో కూడా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆ సినిమాలు ఏవి కూడా అతనికి సరైన సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. చివరగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పరవాలేదు అనిపించింది.

ఇక ఇప్పుడు ఎలాగైనా ఏజెంట్ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం అతను తన ప్రాణం పెట్టి నటిస్తున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెజెండ్ సినిమా ఒక డిఫరెంట్ స్పై యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అఖిల్ ఒక గూడచారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం అఖిల్ గతంలో ఎప్పుడూ లేని విధంగా తన ఫిట్నెస్ లో కూడా చాలా మార్పులు తెచ్చాడు. సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్న అఖిల్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టించేలా ఉన్నాడు అనిపిస్తోంది. ఇక ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అభిమానులు చాల రోజులుగా ఎదురుచూస్తున్నారు.

Agent producer anil sunkara clarification on agent teaser update

ఇక నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా టీజర్ వస్తుంది అనే ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. అసలైతే చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ రోజు ఒక పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేయాలని అనుకుంది. కానీ ఆ ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేకపోయాయి. దీంతో సోషల్ మీడియా ద్వారా స్పందించిన చిత్ర నిర్మాత అనిల్ సుంకర అక్కినేని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అనుకోని కారణాల వలన ఈ సినిమా టీజర్ జు నేడు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయలేక పోతున్నామని తప్పకుండా త్వరలోనే మీ అంచనాలకు తగ్గట్టుగా అద్భుతమైన హై క్వాలిటీ టీజర్ అందిస్తామని తెలియజేశారు.

తప్పకుండా మే నెలలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని కూడా తెలియజేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా సినిమా అనంతరం తెరకెక్కిస్తున్న ఏజెంట్ సినిమా కోసం దాదాపు 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆ మధ్యలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. కుదిరితే పాన్ ఇండియా ప్రాజెక్టుగా కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఆ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ఏజెంట్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X