హీరోల కంటే హీరోయిన్లకే అది ఎక్కువ, వయసు పట్టించుకోవద్దు.. 50 ఏళ్ల ఏజ్‌లో నేను ఇప్పటికీ.. అజయ్ దేవగన్
Recommended Video

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న దే దే ప్యార్ దే సినిమా ట్రైలర్ అట్టహాసంగా ముంబైలో విడుదలైంది. ఏప్రిల్ 2 తేదీన అజయ్ జన్మదినం సందర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ ఆవిష్కరణ జరిగింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో టబు, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఆయన నటించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అదేమిటంటే..

రోజులు, పరిస్థితులు మారాయి
బాలీవుడ్‌లో పాత రోజులను తలచుకొంటే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారిపోయాయి. పదేళ్ల క్రితం హీరోయిన్ల కెరీర్ చాలా ముప్పు ఉండేది. కానీ ఇప్పుడు హీరోల కంటే హీరోయిన్ల కెరీర్ సుదీర్ఘంగా సాగుతున్నది. దశాబ్ద కాలంలో చాలా మార్పు వచ్చింది అని దే దే ప్యార్ దే సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నారు.

హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా
ఒకప్పుడు పెళ్లి అయినా, వయసు మీద పడినా హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయేది. ఇప్పుడు చూడండి.. కాజోల్ పెళ్లి చేసుకొన్నప్పటికీ తన కెరీర్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నది. వయసు మీద పడినా గానీ టబు నేటితరం హీరోయిన్లకు ధీటుగా రాణిస్తున్నది. ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పులు వస్తున్నాయి అని అజయ్ అన్నారు.

ఫిట్‌నెస్ చాలా ముఖ్యం
ప్రస్తుత కాలంలో వయసును పెద్దగా పట్టించుకోవద్దు. అది కేవలం ఓ నంబర్ మాత్రమే. నా సహచర నటులందరూ చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండాలంటే ఫిట్‌నెస్ గురించి ఆలోచించాలి. నేను కూడా నా ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్ గురించి చాలా శ్రద్ద తీసుకొంటాను అని అజయ్ దేవగన్ అన్నారు.

మే 17న దే దే ప్యార్ దే రిలీజ్
50 ఏళ్ల వయసులో అజయ్ దేవగన్ ఇద్దరు హీరోయిన్లు టబు, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి దే దే ప్యార్ దే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని టీ సీరిస్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు లవ్ రంజన్ రూపొందించారు. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రానికి అకివ్ అలీ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











