రూ. 7 కోట్లతో ఖరీదైన కారు కొన్న RRR మూవీ నటుడు... ఎవరంటే?
Recommended Video
లగ్జరీ కార్లు అంటే బెంజ్, బిఎండబ్ల్యు, ఆడి లాంటి పేర్లు చెబుతాం. కానీ ఈ లగ్జరీ కార్లను మించిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్. ఈ కారు కలిగి ఉండటం అంటే ప్రత్యేకమైన స్టేటస్ కలిగి ఉన్నట్లు భావిస్తారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన, క్లాసిక్ కార్ల బ్రాండ్‌గా పేరొందిన దీన్ని దక్కించుకోవడం అంటే ఆశామాషీ కాదు. ఇండియాలో వేళ్లపై లెక్కించదగ్గ కొందరు ప్రముఖులు మాత్రమే రోల్స్ రాయిస్ కలిగి ఉన్నారు. తెలుగువారిలో ఈ కారు కలిగి ఉన్న ఒకే ఒక్క ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవి.
ఇటీవలే ఈ సంస్థ రోల్స్ రాయిస్ కుల్లినన్ పేరుతో ఎస్‌యూవీ మోడల్ విడుదల చేసింది. ఈ కారు కలిగి ఉన్న భారతీయుల క్లబ్‌లో నటుడు అజయ్ దేవగన్ చేరారు. ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర 6.95 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఈ కారు ఇండియాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, టి-సిరీస్ మొగల్ భూషణ్ కుమార్ మాత్రమే కలిగి ఉన్నారు.

అజయ్ దేవగన్ గ్యారేజీలో ఉన్న కార్లు ఇవే
అజయ్ దేవగన్ రోల్స్ రాయిస్‌తో పాటు ఇప్పటికే ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్, వోల్వో ఎక్స్‌సి 90. టయోటా సెలికా వంటి వాటిని కలిగి ఉన్నారు. భారతదేశంలో మసెరటి క్వాట్రోపోర్ట్ మొదటి యజమాని కూడా ఈయనే. ఈ సంవత్సరం ప్రారంభంలో, కరణ్ జోహార్ చాట్ షో, కాఫీ విత్ కరణ్‌లో చమత్కారమైన సమాధానం ఇచ్చినందుకు అతను ఆడి ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్‍ను గెలుచుకున్నాడు.

రోల్స్ రాయిస్ కలిగి ఉన్న సినీ ప్రముఖులు
రోల్స్ రాయిస్‌ను కలిగి ఉన్న ఇతర భారతీయ ప్రముఖులలో అక్షయ్ కుమార్, చిరంజీవి, ఆది గోద్రేజ్ ఉన్నారు, వీరిలో ప్రతి ఒక్కరి వద్ద ఏడవతరం రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇలాంటి కారునే చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా బహుమతిగా ఇచ్చినట్లు జిక్యూ మేగజైన్ గతంలో పేర్కొంది.

రోల్స్ రాయిస్ కుల్లినన్
లగ్జరీ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ నుండి వచ్చిన మొదటి ఎస్‌యూవీ కుల్లినన్. యజమాని ప్రత్యేకతలకు అనుగుణంగా దీన్ని తయారు చేస్తారట. ఇది 6.8-లీటర్ వి 12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది, 560 బిహెచ్‌పి, 850 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఐదు సెకన్లలోపు 0-100 కిలోమీటర్ల నుండి వెళ్ళగలదు, నియంత్రిత టాప్ స్పీడ్ గంటకు 249 కిలోమీటర్లు. అజయ్ దేవగన్ కుల్లినన్ నీలం రంగులో ఉన్నట్లు తెలుస్తోంది. రోల్స్ రాయిస్ తన వినియోగదారులకు సీట్ కాన్ఫిగరేషన్‌తో సహా పలు ప్రత్యేక ఫీచర్లు అందిస్తోంది.

అజయ్ దేవనగ్
అజయ్ దేవగన్ సినిమాల విషయానికొస్తే... ఈ ఏడాది టోటల్ ధమాల్, దేదే ప్యార్ దే చిత్రాల్లో నటించాడు. త్వరలో తుర్రమ్ ఖాన్, తానాజీ - ది అన్సంగ్ వారియర్, మైదాన్, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, RRR నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











