180 కోట్లతో అజిత్ అరుదైన రికార్డు.. తలా బోల్డ్ అండ్ న్యూ లుక్ వెనుక అసలు కథ అదేనట!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ లేటేస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. దాదాపు గుండు కొట్టించుకొన్నంత పనిచేసి న్యూ లుక్‌తో కూడిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ అజిత్ క్యాజువల్‌గా లుక్ మార్చారా? లేదా ఏదైనా సినిమా కోసం తన రూపు రేఖలను మార్చుకొన్నారా? అనే విషయంపై అభిమానులు రకరకాలుగా చర్చించుకొంటున్నారు. అయితే అజిత్ లుక్ ఎలా ఉంది? ఈ లుక్ దేని కోసం అనే వివరాల్లోకి వెళితే..
సాధారణంగా హీరోలు బయటకు రావాలన్నా.. బాహ్య ప్రపంచానికి కనిపించాలన్న లుక్ పరంగా చాలా జాగ్రత్లలు తీసుకొంటారు. నీట్ షేవ్ చేసుకోవడమో లేదా? గడ్డం ట్రిమ్ చేసుకోవడమో లేదా పొడవాటి గడ్డాన్ని, తలపై జట్టును స్టైలిష్ మార్చుకొని బయటకు వస్తుంటారు. కానీ అజిత్ అలాంటి వ్యవహారాలకు చాలా దూరం. తెల్లగడ్డం, తలపై తెల్లటి జుట్టుతో ఎలాంటి మేకప్ లేకుండా సహజంగా ఎలా ఉంటాడొ అలానే కనిపిస్తాడు.

ఇక సినిమాల్లో కూడా గడ్డానికి రంగు వేసుకోకుండా తాను ఎలా ఉంటాడో అలానే తెర మీద కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఏదైనా పాత్ర డిమాండ్ చేస్తే తప్పా.. తలకు, గెడ్డానికి కలర్ వేసుకోని కనిపిస్తాడు. అలాంటి అజిత్ తన బోల్డ్ లుక్‌తో అభిమానులను థ్రిల్ చేశాడు. తలపై వెంట్రుకలను చాలా చిన్నగా కత్తిరించుకొని.. గెడ్డం, మీసాలు తీసి.. నీట్ షేవ్‌తో కనిపించడంతో ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
అయితే అజిత్ గుండు కొట్టించుకోవడం వెనుక కారణం ఏమిటనే ప్రశ్నలు చాలానే మీడియాలో వినిపిస్తున్నాయి. దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా కోసమే ఆ లుక్‌ను సొంతం చేసుకొన్నాడు అని అభిమానులు చెప్పుకొంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు అనే వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందే AK64 సినిమాను సుమారుగా 275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు 180 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయం తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నది.
ఇదిలా ఉండగా, అజిత్, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. తమిళ సినిమా పరిశ్రమలో 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











