సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్!
Game Changer: నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ . మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కావడంతో తమిళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ మూవీ పై తమిళ తంబీలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ కు సంతోషం కలిగించేలా.. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా విడుదల నేపథ్యంలో ఓ స్టార్ హీరో సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ మూవీ ఏంటి? వివరాల్లోకెళ్తే..
వాస్తవానికి సంక్రాంతికి, సినిమాలకు విడదీయలేని బంధం ఉంటుంది. ఈ పండుగ సందర్బంగా విడుదలయ్యే సినిమాల జాతర మమూలుగా ఉండదు. చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన సినిమాలతో సంక్రాంతి బరిలో నిలుస్తారు. అలా ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ.. డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్.. సంక్రాంతి వస్తున్నాం, ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అలాగే.. పాన్ ఇండియా సినిమా గా రూపొందిన గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10న మూవీ లవర్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడంతో తెలుగు తోపాటు తమిళంలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి రెండు రోజుల ముందే విడుదల కాబోతుండడంతో తెలుగులో ఓపెనింగ్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. అయితే తమిళంలో నిన్న మొన్నటి వరకు గట్టి పోటీ ఉండబోతుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ప్రకారం విక్రమ్ వీరా ధీర సూరం, బాల వనంగాన్, అజిత్ విడాముయర్చి వంటి భారీ సినిమాలతో సంక్రాంతి రేసులో నిలువబోతున్నట్లు ప్రచారం జరిగింది ఈ సినిమాలో అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే.. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆ సినిమాలలో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. ఈ సినిమాలకు సంబంధించిన కొన్ని షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమిళ సూపర్ స్టార్ అజిత్ మాత్రం రేసులో ఉండబోతున్నారని, జనవరి 10 న తన విడాముయర్చి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే పలు కారణాలతో యాక్షన్ త్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆ సినిమా మూవీ మేకర్స్ ప్రకటన కూడా చేశారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ పడుతున్నారు. సినిమా విడుదల తేదీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించకన్నప్పటికీ, జనవరి చివరివారంలో విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే.. అజిత్ మూవీ లవర్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అయినా.. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాస్తవానికి సూపర్ స్టార్ అజిత్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉంది, వరుసగా విజయాలను అందుకుంటు స్టార్ పొజిషన్లో నిలిచారు.

ప్రస్తుతం అజిత్ సినిమా విడాముయర్చి సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్లోబల్ స్టార్ కు తిరుగు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద జనవరి 10 నుండి గేమ్ చేంజర్ ఎలాంటి గేమ్ సెట్ చేస్తాడో.. కలెక్షన్లు ఏ రీతిలో వసూలు చేస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











