అజిత్ ఫ్యాన్స్‌కు షాక్.. చేతులెత్తేసిన బోనికపూర్.. సునామీ అంటూ ట్వీట్
ప్రముఖ నిర్మాత బోనికపూర్ ప్రతిష్టాత్మకంగా సూపర్‌స్టార్ అజిత్‌తో రూపొందిస్తున్న తమిళ చిత్రం వాలిమై రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ 50వ బర్త్ డేను పురస్కరించుకొని మే 1 తేదీన ఫ్యాన్స్‌కు కానుకగా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ పరిస్థితుల వల్ల ఫస్ట్‌లుక్ వాయిదా వేస్తున్నట్టు నిర్మాత బోనికపూర్ అధికారికంగా ప్రకటించారు.
వాలిమై సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని అనుకొన్నప్పుడు కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కరోనావైరస్ సునామీలా చుట్టేస్తున్నది. లక్షలాది మంది ప్రజలు దేశంలో ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చాలా మంది కుటుంబ సభ్యులను, స్నేహితులను కోల్పోతున్నారు అని బోని కపూర్ ట్వీట్ చేశారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, వాలిమై యూనిట్ సభ్యులందరూ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నాం. త్వరలోనే ఫస్ట్‌లుక్ తేదీని ప్రకటిస్తాం అని బోనికపూర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి బాగోగులు, క్షేమం కోసం చేతులు కలిపి ప్రార్థిస్తాం అంటూ పేర్కొన్నారు.
నటీనటులు: అజిత్ కుమార్, హ్యూమా ఖురేషి, కార్తీకేయ గుమ్మకొండ, యోగిబాబు, సంగీత, శివాజీ గురువాయూర్, పావేల్ నావగీతన్ తదితరులు
రచన, దర్శకత్వం: హెచ్ వినోద్
నిర్మాత: బోనికపూర్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
బ్యానర్స్: బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్


Click it and Unblock the Notifications











