షాకిస్తున్న అజిత్ కొత్త లుక్.. గుర్తుపట్టలేనంతగా!
తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నాడు. అజిత్ వరుసగా నాలుగవసారి శివ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ కాంబినేషన్ వరుసగా విజయాలు అందుకుంటోంది. తాజగా రూపొందుతున్న విశ్వాసం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శివ వరుసగా అజిత్ ని ప్రతి చిత్రంలో విభిన్నమైన లుక్ లో చూపిస్తన్నాడు.
విశ్వాసం చిత్రంలో కూడా అజిత్ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అజిత్ కొత్త లుక్ కు సంబందించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీగా గడ్డం, పెద్ద మీసాలతో అజిత్ దర్శనమిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలటనే అజిత్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

అజిత్ ఫాన్స్ మాత్రం ఈ లుక్ చూసి సంతోషంలో మునిగి తేలుతున్నారు. తమ అభిమాన హీరో మాస్ లుక్ లో కనిపిస్తుండడంతో ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వాసం చిత్రంలో అజిత్ సరసన హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.



Click it and Unblock the Notifications











