అజిత్ సినిమా కూడా సంక్రాంతికే.. రజనితో తప్పని పోటీ!
టాలీవుడ్ లో సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మూడు పెద్ద హీరోల సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజని పేట కూడా విడుదుల కానుంది. దీనితో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల బిజినెస్ వందల కోట్లల్లో ఉంది. తమిళ బాక్సాఫీస్ వద్ద కూడా పోటీ పెరిగింది. నిన్నమొన్నటివరకు విడుదల విషయంలో ఊగిసలాడిన అజిత్ చిత్రం.. తాజాగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది.
అజిత్, శివ కాంబినేషన్ లో వరుసగా వస్తున్న నాల్గవ చిత్రం విశ్వాసం. అజిత్, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జనవరి 10 విశ్వాసం చిత్రం విడుదల కానుంది. అదే రోజున రజినీకాంత్ పేట కూడా విడుదల కానుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. అజిత్, రజిని ఇద్దరికీ తమిళనాట ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇమాన్ విశ్వాసం చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శివ, అజిత్ కాంబోలో వచ్చిన చివరి చిత్రం వివేగం అభిమానులని అంతగా ఆకట్టుకోలేదు. దీనితో దర్శకుడు శివ ఈ సారి పకడ్బందీ కథతో రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











