For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda 50 Days celebrations ఎవరైనా హిందూ ధర్మం జోలికి వస్తే ఇక అంతే.. అఖండగా బాలకృష్ణ వార్నింగ్

  |

  తెలుగు సినిమా చరిత్రలో అఖండ విజయం చిరస్మరణీయమైనది. ఏపీలో అనేక ప్రతికూలతలను, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులను ఎదురించి ఈ సినిమా అఖండమైన విజయం సాధించింది. దాదాపు 103 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొన్నది. ఇటీవల కాలంలో బాహుబలి తర్వాత అత్యంత ఘన విజయం సాధించిన చిత్రంగా అఖండ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ సినిమా థియేటర్‌లో జరిగిన వేడుకలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..

  Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
  నాన్నగారికి టిఫిన్ తెచ్చేవాడిని..

  నాన్నగారికి టిఫిన్ తెచ్చేవాడిని..

  హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు అంటే మాకు ప్రత్యేకమైన అనుబంధం. ఈ ప్రాంతానికి వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. రామకృష్ణ స్టూడియోలో నాన్నగారి కోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడిని. అప్పటి రోజులు మధురమైనవి. సమరసింహారెడ్డి శతదినోత్స వేడుకకు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చాను అని బాలకృష్ణ తెలిపారు.

  మొన్న సంక్రాంతి.. నేను అఖండ పండుగ

  మొన్న సంక్రాంతి.. నేను అఖండ పండుగ

  అఖండ విజయం ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. అఖండ చిత్రంలో శివ భక్తుడిగా నేను చేసిన పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తు చేసుకొంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ విజయం ద్వారా మరో పండుగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది అని బాలకృష్ణ చెప్పారు.

  ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు అంటూ

  ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు అంటూ

  కోవిడ్ విజృభిస్తున్న సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అని భయపడ్డాం. కానీ అఖండ సినిమాను చూడటానికి తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఆంధ్ర, తెలంగాణేకే కాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు అని బాలకృష్ణ తెలిపారు.

  కోట్లాది మంది అభిమానులను ఇచ్చారు

  కోట్లాది మంది అభిమానులను ఇచ్చారు

  మానవ పుట్టుకలో ఒకరో ఇద్దరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు అని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.

  అఖండ ప్యాన్ వరల్డ్ సినిమా

  అఖండ ప్యాన్ వరల్డ్ సినిమా

  ప్రస్తుతం కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాళనగా ఈ సినిమా ఉంది. ఈ సినిమా ఇంతటి అద్భుతమైన విజయానికి అభిమానులు, ప్రేక్షకులే కారకులు. అఖండ పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి అని ఆకాంక్షించారు. అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు.

  డిస్నీ+హాట్ స్టార్‌లో అఖండ సినిమా

  డిస్నీ+హాట్ స్టార్‌లో అఖండ సినిమా

  అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాలమధ్య నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. ఈ చిత్రం జనవరి 21వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ+హార్ట్ స్టార్ ఓటీటీలోకూడా చూసి ఎంజాయ్ చేయండి అని బాలకృష్ణ తన అభిమానులకు తెలిపారు.

  English summary
  Nandamuri Balakrishna's Akhanda successfully completes 50 days run in 103 centres which is a rare feat in recent times, not just in Tollywood, but in entire Indian film industry. The film which was made on highest ever budget for Balakrishna has done a business of Rs 200 Cr which includes theatrical gross and non-theatrical revenue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion