అఖండ 100 రోజుల వేడుకకు డేట్ ఫిక్స్.. ఇలాంటి పోస్టర్ చూసి ఎంత కాలం అయ్యిందో..?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఒకవైపు బాలకృష్ణ మరొకవైపు దర్శకుడు బోయపాటి చాలా కష్టపడ్డారు అని చెప్పాలి. సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు దాదాపు ఏడాది వరకు హార్డ్ వర్క్ చేశాడు. ఆ తర్వాత బాలకృష్ణ సినిమా కోసం తన వయసును ఏమాత్రం లెక్కచేయకుండా కష్టపడ్డాడు. అఘోరా పాత్రలో బాలయ్య కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. వరుస పరాజయాలతో ఉన్న బాలకృష్ణకు అలాగే దర్శకుడు బోయపాటికి కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది.

అఖండ సినిమా సాధించిన విజయం మిగతా సినిమాలకు కూడా ఒక ధైర్యం వచ్చింది అనే చెప్పాలి. అసలే కరోనా కారణంగా సినిమాల బిజినెస్ భారీగా తగ్గి పోయిన సమయంలో ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా ఒక నమ్మకంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని కూడా పెంచింది అనే చెప్పాలి. అయితే ఈ సినిమా 100 రోజుకు వేడుకను నిర్వహించాలి అని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు. సినిమా సక్సెస్ తర్వాత చిన్నపాటి ఈవెంట్స్ తోనే చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈసారి అందరితో అఖండ సెలబ్రేషన్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Akhanda movie 100 days thanks event date and place fix

ఇక అక్కడ సినిమాకు సంబంధించిన 'కృతజ్ఞత సభ'ను మార్చి 12వ తేదీన నిర్వహించబోతున్నట్లుగా అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. కర్నూలులోని ఎస్టిబిసి గ్రౌండ్ లో ఈ వేడుకకు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నలువైపుల నుంచి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో రాబోతున్నారు. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహించే అవకాశం ఉంది.

ఇక 100 రోజులు పోస్టర్లు చూసి చాలా కాలం అయింది అంటూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో అఖండ పోస్టర్ ను వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అఖండ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన చూపించిన హావభావాలు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయి. బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఈ సినిమా ఓటిటి లో కూడా మంచి వ్యూవ్స్ అయితే అందుకుంది. సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. అలాగే దర్శకుడు బోయపాటి అఖండ సినిమాకు సీక్వెల్ ని కూడా రూపొందించనున్నట్లు అఫీషియల్ గా తెలియజేశాడు. ఆ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు అని అల్లు అర్జున్ కూడా నటించే అవకాశం ఉండవచ్చు అని ఒక హింట్ అయితే ఇచ్చారు. బోయపాటి తన తదుపరి సినిమాను రామ్ పోతినేనితో చేయనున్నాడు. ఆ సినిమా అనంతరం అఖండ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకు రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X